Grammy Awards 2027: దురంధర్ 2కు నిరాశ.. గ్రామీ నామినేషన్ దక్కించుకున్న తమిళ పాట!

ABN , Publish Date - Nov 18 , 2026 | 09:34 AM

69వ గ్రామీ అవార్డుల్లో తమిళ పాట 'వరువాయి' బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. దురంధర్ 2కు నిరాశ ఎదురైనా భారతీయ సంగీతానికి అరుదైన గుర్తింపు లభించింది.

Varuvaaiy

సంగీత ప్రపంచంలో అత్యున్నతంగా భావించే గ్రామీ అవార్డు (Grammy Awards) ల్లో దురంధర్ 2 (Dhurandhar2) కు నిరాశ మిగిలింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న జరిగే 69వ గ్రామీ పురస్కారాల్లో ఈ చిత్రానికి నామినేషన్ (nomination) దక్కలేదు. ఈ సినిమా నుంచి ఎనిమిది ఎంట్రీలను వివిధ విభాగాల్లో పంపినప్పటికీ.. తుది జాబితాలో ఒక్క పాటకు కూడా స్థానం లభించలేదు. అయితే ఈ చిత్రానికి నిరాశ ఎదురైనప్పటికీ మరో భారతీయ సినిమా పాటకు నామినేషన్ దక్కడం విశేషం.

దేవన్ ఏకాంబరం (Devan Ekambaram), సుభిక్షా రంగరాజన్ (సుషా) (Subhiksha Rangarajan) ఆలపించిన 'వరువాయి' పాట బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ (Best Global Music Performance) విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. గ్రామీ పురస్కారాలకు నామినేట్ అయిన తొలి తమిళ చిత్రంగా అరుదైన గౌరవం సాధించింది. కృష్ణుడిపై భక్తి పారవశ్యంతో మహాకవి సుబ్రహ్మణ్య భారతి (Subramania Bharati) రాసిన కవిత్వమే ఈ గీతం.

Updated Date - Nov 18 , 2026 | 09:36 AM