Vignesh Raja: ‘కర’ హీరోయిన్‌ పాత్ర.. దర్శకుడు ఏమన్నారంటే..

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:46 PM

ధనుష్‌ (Dhanush)హీరోగా ‘పొర్‌ తొళిల్‌’ ఫేం విఘ్నేశ్‌ రాజా (Vignesh Raja) తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర’(Kara). హయిస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 30న తెలుగులోనూ విడుదల కానుంది

ధనుష్‌ (Dhanush)హీరోగా ‘పొర్‌ తొళిల్‌’ ఫేం విఘ్నేశ్‌ రాజా (Vignesh Raja) తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర’(Kara). హయిస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 30న తెలుగులోనూ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజరు ఆకట్టుకుంది. తాజాగా దర్శకుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్‌ పాత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘కర’లో హీరోయిన్‌గా మొదట చైత్ర జె.ఆచార్‌ను సెలెక్ట్‌ చేశాం. లుక్‌ టెస్ట్‌ కూడా చేశాం. ఆమె అప్పటికే శశికుమార్‌ తీసిన ‘మై లార్డ్‌’ చిత్రంలోనూ అలాంటి లుక్‌లోనే కనిపించారు. ఆ విషయాన్ని చెత్ర చెప్పారు. కర కన్నా ముందే ఆ చిత్రాన్ని ప్లాన్‌ చేశారు. ఈ రెండు చిత్రాల్లోనూ హీరోయిన్‌ లుక్‌ ఒకటేలాగా ఉంటుందని భావించి చైత్రను కాదనుకుని మమితా బైజును సంప్రదించాం. ఆమె ఇప్పటి దాకా ఎలక్ర్టిఫయింగ్‌, ఎనర్జీటిక్‌ రోల్స్‌ చేసింది. ఈ సినిమాలో పాత్ర అందుకు భిన్నంగా ఉంటుంది. దాంతో ఈ చిత్రంతో యాక్ట్‌ చేయడానికి అంగీకరించదేమో అనుకున్నా. కానీ, ఆమె ఓకే చేయడంతో ఆశ్చర్యపోయా. ఇందులో పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. ధనుష్‌తో పోటీ పడి నటించింది. తెరపై వీరిద్దరి పాత్రలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి’ అన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 07:07 PM