H Vinod: చెప్పే దమ్ము నాకున్నా.. ప్రసారం చేసే దమ్ము మీకు లేదు..

ABN , Publish Date - May 31 , 2026 | 02:55 PM

విజయ్‌ హీరోగా నటించిన ‘జన నాయగన్‌’ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

విజయ్‌ హీరోగా నటించిన ‘జన నాయగన్‌’ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు హెచ్‌ వినోద్‌ ఓ కార్యక్రమంలో పాల్గొనగా ఈ సినిమా విడుదలపై ఓ ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జన నాయగన్‌’ సినిమా విడుదల మన చేతుల్లో ఉండదు. ఈ చిత్రానికి సంబంధించిన నిజాలు గురించి మాట్లాడేందుకు నాకు ధైౖర్యం లేదు. ఒకవేళ ధైౖర్యం చేసి మాటాడినా.. దానిని ప్రసారం చేసే దమ్ము మీకు లేదు’ అని అనడం నెట్టింట వైరల్‌గా మారింది.

దీంతో దర్శకుడు ఎందుకిలా మాట్లాడడనే దానిపై చర్చ మొదలైంది. ఈ చిత్రం అసలు సంక్రాంతికి విడుదల కావల్సింది. కానీ సెన్సార్‌ బోర్ట్‌ నిబంధనలు, ఆంక్షల కారణంగా కోర్టు వరకే వెళ్లింది. రివైజింగ్‌ కమిటీ ఈ సినిమా చూసి రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని నిర్మాత ఇటీవల తెలిపారు. అయితే ఇప్పుడు విజయ్‌ సీఎం అయ్యారు కాబట్టి సమస్యలన్ని ఓ కొలిక్కి వచ్చి త్వరగా విడుదలవుతుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ ఇ్కఆ వ్యవహారం చక్కబడలేదు. అందుకే ఇంకా రిలీజ్‌ డేట్‌ కూడా ఇవ్వలేదు.

Updated Date - May 31 , 2026 | 03:15 PM