Gautham Vasudev Menon: నా కెరీర్.. నాశనం చేయాలని కుట్ర చేశారు

ABN , Publish Date - May 04 , 2026 | 06:39 PM

ధృవ నక్షత్రం విడుదలపై గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్‌ను దెబ్బతీయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Gautham Vasudev Menon

నా కెరీర్‌ను నాశనం చేయాలని కొందరు కుట్ర పన్నుతున్నారని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ (Gautham Vasudev Menon) ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దర్శకత్వంలో 2017లో విక్ర‌మ్ హీరోగా ప్రారంభించిన ధృవ నక్షత్తిరం (Dhruva Nakshathram) ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని ఇప్పటి వరకు విడుదల కాలేదు. పైగా ఈ సినిమా వ్యవహారం కోర్టుకు చేరింది. గత వారం విచారణ జరిపిన కోర్టు ఎట్ట‌కుల‌కు ఈ సినిమాను విడుదల చేసుకునేందుకు అనుమతిచ్చింది.

దీనిపై గౌతమ్ మీనన్ స్పందించారు. చాలా మంది 'ధృవ నక్షత్తిరం' చిత్రం విడుదల కాకుండా అడ్డుకోవాలని, తద్వారా నా కెరీర్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు. అయితే, కోర్టు న్యాయం చేసింది. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న చిత్రాన్ని విడుదల చేసుకునేందుకు న్యాయస్థానం అనుమతిస్తూ తీర్పునిచ్చింది. ఈ చారిత్రాత్మక తీర్పు భవిష్యత్లో అనేక చిత్రాలకు ఆదర్శంగా ఉంటుంది' అని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. జూన్ 15లోపు సినిమా విడుద‌ల చేసుకోవ‌చ్చ‌ని కోర్టు అదేశాలు ఇవ్వ‌గా వ‌చ్చిన క‌లెక్ష‌న్లు ఓ ప్ర‌త్యే క‌బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చ‌సి అందులో డిపాజిట్ చేయాల‌ని తీర్పునిచ్చింది. ఈ నేప‌థ్యంలో గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఈ నెలాఖ‌రులో (మే 27)న ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌కు తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది.

Updated Date - May 04 , 2026 | 06:43 PM