ఇద్దరు కుమారులతో.. మెట్ల మార్గంలో పళని కొండెక్కిన ధనుష్
ABN , Publish Date - Sep 27 , 2026 | 09:45 AM
స్టార్ హీరో ధనుష్ తన కుటుంబ సభ్యులతో కలిసి పళని మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు.
హీరో ధనుష్ (Dhanush) శనివారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ్య పుణ్యక్షేత్రమైన పళని మురుగన్ (Palani Temple) ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 6 గంటలకే మెట్ల మార్గంలో తన ఇద్దరు కుమారులు, తల్లిదండ్రులు, అక్కలతో కలిసి ధనుష్ కొండపైకి చేరుకుని పూజల్లో పాల్గొన్నారు.
ఆపై మురుగ పెరుమాళ్ను దర్శనం చేసుకుని, కొద్దిసేపు కొండపైనే ఉన్నారు. ఆ తర్వాత రోప్ కార్‌లో కొండదిగి వెళ్ళారు. తమ అభిమాన హీరో రాక గురించి తెలుసుకున్న ధనుష్ అభిమానులు పళని కొండ కిందిభాగంలో భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ధనుష్ సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. అయితే, పోలీసుల సాయంతో ధనుష్ కుటుంబ సభ్యులు కారులో ఎక్కి వెళ్ళిపోయారు.