Dhanush: గెలుపు.. ఓటమి.. పోరాటం చేయాల్సిందే..
ABN , Publish Date - Apr 21 , 2026 | 08:08 AM
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించే ‘వడ చెన్నై’ రెండో భాగం త్వరలోనే రూపుదిద్దుకుంటుందని దర్శకుడు వెట్రిమారన్ చెప్పారు.
ధనుష్ (Dhanush) హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించే ‘వడ చెన్నై’ (Vada Chennai) రెండో భాగం త్వరలోనే రూపుదిద్దుకుంటుందని దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaran) చెప్పారు. ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కర’ ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా మారి సెల్వరాజ్, వెట్రిమారన్ హాజరయ్యారు. ఇందులో వెట్రిమారన్ ప్రసంగించేందుకు వేదికపైకి రాగానే ధనుష్ అభిమానులు ‘వడచెన్నై’ అంటూ నినాదాలు చేశారు. దీంతో వెట్రిమారన్ స్పందిస్తూ, ‘వడచెన్నై’ తొలి భాగం నిర్మాత, దర్శకుడు, హీరో ఇక్కడే ఉన్నారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుంది. అది కూడా చాలా త్వరగానే జరుగుతుందన్నారు.
ఆ తర్వాత హీరో ధనుష్ కూడా ఇదే అంశంపై స్పందించారు. ‘గెలుపుకైనా, ఓటమికైనా పోరాటం చేయాల్సిందే. మీరు అనుకునేది నెరవేరేందుకు ఎంతో దూరం లేదు. సమీపంలోనే ఉందన్నారు. విగ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ‘కర’ చిత్రాన్ని వేల్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఐసరి కె. గణేష్ నిర్మించారు. ఈ సినిమాలోనూ అదే పేరుతో ఏప్రిల్ 30న జనం ముందుకు రాబోతోంది.