2028లో.. ధనుష్ ‘అబ్దుల్‌ కలాం’

ABN , Publish Date - Feb 13 , 2026 | 09:44 AM

హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న ధనుష్ త్వరలో వరుస బయోపిక్‌లలో నటించనున్నారు.

dhanush

హీరోగా, దర్శకుడిగా నిర్మాతగా, నేపథ్యగాయకుడిగా రాణిస్తున్న నటుడు ధనుష్ (Dhanush) దివంగత భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం (Dr. A.P.J. Abdul Kalam) జీవిత చిత్రంలో నటించనున్నారు. 2025లో ప్రకటించిన ఈ ప్రాజెక్టు ఇది పురుష్ ఏం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో 2028లో పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ధనుష్‌ తన 55వ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ మూవీ పూర్తి చేసిన తర్వాత ఇళయరాజా (aiyaraaja) బయోపిక్‌లో నటించనున్నారు. ఇది 2026లో సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఆ తర్వాత అబ్దుల్‌ కలాం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందే క‌లాం ది మిస్సైల్‌మాన్ ఆఫ ఇండియా (Kalam: The Missile Man of India) మూవీలో నటించనున్నారు. తమిళనాడులో జన్మించి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇద్దరు గొప్ప వ్యక్తుల బయోపిక్‌లలో నటించే అరుదైన అవకాశాన్ని ధనుష్‌ దక్కించుకోవడం విశేషం.

Updated Date - Feb 13 , 2026 | 10:54 AM