ఇళయరాజా బయోపిక్.. ఆ వార్తల్లో నిజం లేదు

ABN , Publish Date - Feb 09 , 2026 | 08:49 PM

సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత కథతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ధనుష్‌ ప్రధాన పాత్రలో అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో ఈ బయోపిక్‌ మొదలైన సంగతి తెలిసిందే.

సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత కథతో ఓ సినిమా (Ilaiyaraaja biopic) తెరకెక్కుతోంది. ధనుష్‌ (Dhanush) ప్రధాన పాత్రలో అరుణ్‌ మాథేశ్వరన్‌ (Arun madheswaran) దర్శకత్వంలో ఈ బయోపిక్‌ మొదలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత, డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘డీసీ’ (DC) సినిమా ప్రారంభించారు  అరుణ్‌. ఈ క్రమంలోనే.. ఇళయరాజా బయోపిక్‌కు ఆయన దర్శకత్వం వహించట్లేదని, ఈ చిత్రం నుంచి దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌ (Arun Matheswaran) వైదొలిగారని వార్తలు వచ్చాయి. ఆయన స్థానంలో మరొకరు ఆ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ధనుష్‌ టీమ్‌ (Dhanush Team) స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.  ప్రస్తుతం ఆయన  డైరెక్ట్ చేస్తున్న ‘డీసీ’ (DC Movie) సినిమా పూర్తి కాగానే దర్శకుడు అరుణ్‌.. ఇళయరాజా బయోపిక్‌ షూటింగ్‌  తిరిగి మొదలు పెడతారని  తెలిపింది. ధనుష్‌- అరుణ్‌ కాంబినేషన్‌లో గతంలో.. ‘కెప్టెన్‌ మిల్లర్‌’ మూవీ వచ్చింది. 

Updated Date - Feb 09 , 2026 | 08:56 PM