Dhanush: ధ‌నుష్ D55 స్టార్ట్‌.. ఈ కాంబోలో 'రౌడీ బేబీ' పాట‌ ఉంటేనా

ABN , Publish Date - Feb 05 , 2026 | 03:17 PM

ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా అమ‌ర‌న్ ఫేమ్‌ రాజ్ కుమార్ పెరియ స్వామి ద‌ర్శ‌కత్వంలో కొత్త చిత్రం గురువారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైంది.

Dhanush

ధ‌నుష్ (Dhanush) క‌థానాయ‌కుడిగా అమ‌ర‌న్ ఫేమ్‌ రాజ్ కుమార్ పెరియ స్వామి (Rajkumar Periasamy) ద‌ర్శ‌కత్వంలో కొత్త చిత్రం గురువారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. లేడీ ప‌వ‌ర్ స్టార్ సాయి ప‌ల్ల‌వి (Sai Pallavi), టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) క‌థానాయిక‌లుగా న‌టిస్తోండ‌గా మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి (Mammootty) కీ రోల్ చేస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్షేష‌న్ సాయి అభ‌యంక‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

D55

తాజాగా చెన్నెలో నిర్వహించిన కార్య‌క్ర‌మంలో ధ‌నుష్‌తో పాటు సాయి ప‌ల్ల‌వి, శ్రీలీల‌, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు హ‌జ‌ర‌య్యారు. కాగా త్వ‌ర‌లోనే షూటింగ్ స్టార్ట్ చేసి ద‌స‌రా, దీపావ‌ళి స‌మ‌యంలో సినిమాను ప్రేఓకుల ఎదుట‌కు తీసుకురానున్న‌ట్లు స‌మాచారం. కాగా ఈ కార్య్క‌ర‌మానికి సంబంధ‌ఙంచిన ఫొటోలు ప్ర‌స్తుతం బ‌య‌ట‌కు రాగా సినీ ల‌వ‌ర్స్, వారి వారి ఫ్యాన్స్ తెగ సంబుర ప‌డిపోతున్నారు.

D55

ముఖ్యంగా ధ‌నుష్‌, సాయి ప‌ల్ల‌వి, శ్రీలీల క‌ల‌సి ఉన్న ఫోటోల‌ను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇది క‌దా కాంబినేష‌న్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు డ్యాన్స్‌లో ఒక‌రిని మించిన వారు మ‌రొక‌రు కావ‌డంతో వీరి ముగ్గురికి క‌లిపి రౌడీ బేబీ పాట‌ త‌ర‌హాలో ఓ పాట‌పెడితే చాలు ఈ జీవితానికి ఇది చాలు ఇంకెం వ‌ద్దు అంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. చూడాలి సినిమాలో అలాంటి పాట‌కు ఏమైనా సిట్యూవేష‌న్ ఉందో లేదో.

D55

Updated Date - Feb 05 , 2026 | 03:17 PM