'ఓమ్' అంటున్న ధనుష్! కొత్త సినిమా.. టైటిల్ గ్లింప్స్ అదిరింది
ABN , Publish Date - Jun 18 , 2026 | 10:18 PM
కర సినిమా తర్వాత తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తోన్న 55వ చిత్రం ఓం.
కర సినిమా తర్వాత తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తోన్న 55వ చిత్రం 'ఓమ్'. 'ఛాప్టర్ 1 ఉదిరమ్ ద బ్లడ్ వ్యూ' అనే ట్యాగ్‌లైన్ ఉండడం చూస్తుంటే ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెకుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా గురువారం రాత్రి ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తూ మేకర్స్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్టేట్ ఇచ్చారు. సినమాకు 'ఓమ్' అనే పేరు ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ ఓ చిన్నపాటి గ్లిమ్స్ వీడియో విడుదల చేశారు.
రెండేండ్ల క్రితం శివ కార్తికేయన్ హీరోగా వచ్చి సంచలన విజయం సొంతం చేసుకున్న అమరన్ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియ స్వామి ( Rajkumar Periasamy) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో సాయి పల్లవి (Sai Pallavi), శ్రీలీల కథానాయికలు.
వాస్తవిక సంఘటనల ఆధారంగా.. ఎర్ర చందనం నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ 'ఓమ్' మూవీని దసరా సందర్భంగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ఎదుటకు తీసుకు రానున్నారు. ఈ క్రమంలో రిలీజ్ చేసిన వీడియో సైతం మూవీపై కొత్త క్యూరియాసిటీని తీసుకు వస్తుంది. మీరూ ఓ లుక్ వేయండి.
మరోవైపు ధనుష్ తన పెద్ద కుమారుడు యాత్రను హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అని నెట్టింట జోరుగా ప్రచారం సాగు తోంది. మొదట స్వీయ దర్శకత్వంలోనే యాత్రను పరిచయం చేయాలని భావించారు ఆయన. కానీ ఇప్పుడు ఈ బాధ్యతను 'ఓమ్' దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామికి అప్పగించనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు ధనుష్ నిర్మాతగా వ్యవహరించనున్నారని టాక్..