Dhanush: కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ..
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:09 PM
తమిళ స్టార్ ధనుష్ (Dhanush) తన సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ బ్యానర్‌పై 20వ చిత్రాన్ని ప్రకటించారు.
తమిళ స్టార్ ధనుష్ (Dhanush) తన సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ బ్యానర్‌పై 20వ చిత్రాన్ని ప్రకటించారు. మ్యూజిక్ వీడియోలతో గుర్తింపు పొందిన రమేశ్ నందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రైమార్క్ ప్రొడక్షన్ అధినేత హరిత లింగసాసామి నిర్మాణ భాగస్వామి. త్వరలో నటీనటులు, ఇతర సాంకేతిక బృందం గురించి వెల్లడించనున్నారు.
‘3’ చిత్రంతో ధనుష్ ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దీనిపై వరుస చిత్రాలు నిర్మించారు. ‘వడ చెన్నై’, ‘నానున్ రౌడీదాన్’, కాలా, కాకా ముట్టై, ఇడ్లీ కడయ్ వంటి విజయవంతమైన చిత్రాలు ఈ బ్యానర్ నుంచి వచ్చినవే! ప్రస్తుతం ధనుష్ ‘కర’ సినిమాతో బిజీగా ఉన్నారు. విఘ్నేశ్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. మమిత బైజు, సూరజ్ వెంకటరమూడి, కేఎస్ రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వి తదితరులు నటిస్తున్నారు.