అరుణాచలంలో.. ధనుష్, సాయిపల్లవి, శ్రీలీల

ABN , Publish Date - Aug 05 , 2026 | 08:33 AM

సౌత్ స్టార్స్ ధ‌నుష్‌, సాయి ప‌ల్ల‌విలు ఇరువురు సోమవారం అరుణాచ‌లంలో సంద‌డి చేశారు.

dhanush sai pallavi

ప్రముఖ నటి సాయిపల్లవి (Sai Pallavi) తిరువణ్ణామలై క్షేత్రాన్ని (Tiruvannamalai Temple) సందర్శించి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. సోమవారం ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు సాదర స్వాగతం స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఆమెను వేద పండితులు ఆశీర్వదించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సాయిపల్లవిని చూసిన స్థానికులతో పాటు భక్తులు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. కాగా, సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న 'రామాయణం' చిత్రంలో సీతగా నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆమె చేతిలో జపమాల ధరించి వ్రతంలో నిమగ్నమైవున్నారు. ఈ క్రమంలోనే ఆమె ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

అయితే.. అదే రోజు స్టార్ హీరో ధ‌నుష్ (Dhanush) సైతం అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్నారు. తిరువణ్ణామలై ఆలయంలో ఆడి ఉత్స వాలు ఘనంగా జరుగుతున్న క్రమంలో ధ‌నుష్ అన్నా మలైయార్ ఆలయాన్ని సందర్శించారు. భారీ బందోబస్తుతో ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఉన్నామలై సమేత అన్నామలైయా రాస్వామిని దర్శించుకున్నారు. చివరగా ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఇదిలా వుండగా, హీరో ధనుష్ ఆలయానికి రావడం గమనించిన అభిమానులు, భక్తులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

ఇదిలాఉంటే.. ఒకే రోజు ధ‌నుష్‌, సాయి ప‌ల్ల‌విలు ఇరువురు అరుణాచ‌లేశ్వ‌రుడిని ద‌ర్శించుకోవ‌డం ప్రాధాన్య‌త‌ను ద‌క్కించుకుంది. మ‌రోవైపు అమ‌ర‌న్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియ స్వామి (Rajkumar Periasamy) ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్, మ‌మ్ముట్టి (Mammootty), సాయి ప‌ల్ల‌వి , శ్రీలీల (Sreeleela) వంటి స్టార్లు న‌టించిన ఓం (Om) సినిమా మ‌రో రెండు నెల‌ల్లో థియేట‌ర్ల‌కు రానుంది. కాగా.. మంగ‌ళ‌వారం సాయంత్రం తెలుగు భామ శ్రీలీల సైతం అరుణాచ‌లేశ్వ‌ర స్వామి ప్ర‌త్యేక ద‌ర్శ‌నం చేసుకున్నారు.

Updated Date - Aug 05 , 2026 | 09:14 AM