Dhanush: షాకింగ్.. ధనుష్- మృణాల్ పెళ్లి

ABN , Publish Date - Jan 16 , 2026 | 01:29 PM

ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సర్వ సాధారణం. వాటిని సీరియస్ గా తీసుకున్నవారు మీడియా ముందుకు వచ్చి అవన్నీ నిజాలు కాదు అని చెప్తారు.

Dhanush

Dhanush: ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సర్వ సాధారణం. వాటిని సీరియస్ గా తీసుకున్నవారు మీడియా ముందుకు వచ్చి అవన్నీ నిజాలు కాదు అని చెప్తారు. ఆ రూమర్స్ ని ఈజీగా తీసుకున్నవారు నవ్వుకొని వదిలేస్తారు. తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) రెండో కేటగిరికి చెందింది అని చెప్పొచ్చు. గత కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) తో ఆమె ప్రేమాయణం నడుపుతుంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇద్దరూ కలిసి బాలీవుడ్ మీడియా ముందు చెట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. అసలు సంబంధమే లేని సినిమా ఫంక్షన్ లో ధనుష్ కోసం మృణాల్ సందడి చేసింది. ఎవరికీ తెలియకుండా ధనుష్ కుటుంబం సభ్యులతో మృణాల్ మాట్లాడుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని చెప్పడానికి కావాల్సిన అన్ని ఆధారాలను నెటిజన్స్ సేకరించారు.

అయితే ఈ వార్తలపై మృణాల్ స్పందించింది కూడా. ఇలాంటివన్నీ చూసి నవ్వుకుంటాను అని చెప్పి ఒక్కమాటలో అవన్నీ రూమర్స్ అని కొట్టిపడేసింది. ధనుష్ అయితే అసలు ఇదొక రూమర్ నడుస్తుంది అన్న విషయం కూడా తెలియదు అన్నట్లే ఉన్నాడు. ఎప్పుడైతే మృణాల్ ఈ రూమర్ ని ఖండించిందో అప్పటి నుంచి కొద్దిగా వీటికి ఫుల్ స్టాప్ పడింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, సడెన్ గా మృణాల్ - ధనుష్ పెళ్లి చేసుకుంటున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

ధనుష్ - మృణాల్ పెళ్లి ఫిబ్రవరి 14 న జరగబోతుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే ఇరు వర్గాల కుటుంబ సభ్యులు పెళ్లి వేదికను నిర్ణయించారని, చాలా సింపుల్ గా వీరి పెళ్లి జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ వార్తపై నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు. మృణాల్ ప్రస్తుతం కెరీర్ లో బిజీగా ఉంది. ఎంతో భవిష్యత్ ఉంది. అప్పుడే పెళ్లి.. అందులోనూ ఆల్రెడీ పెళ్లి అయ్యి, పిల్లలు ఉన్న ధనుష్ తోనా అని నోర్లు వెళ్లబెడుతున్నారు. మరి ఈ పెళ్లి రూమర్స్ పై ఈ జంట ఎలా స్పందిస్తారో చూడాలి.

Updated Date - Jan 16 , 2026 | 01:33 PM