Sai Durga Tej: నా  ప్రేమకథలకు.. ధనుష్ సాంగ్స్ కు  కనెక్షన్ ఉంది.. 

ABN , Publish Date - Apr 27 , 2026 | 09:46 AM

 'నా జీవితంలోని ప్రేమ కథలకు ధనుష్(Dhanush) లవ్ సాంగ్స్‌కి చాలా కనెక్షన్ ఉంది.

 'నా జీవితంలోని ప్రేమ కథలకు ధనుష్(Dhanush) లవ్ సాంగ్స్‌కి చాలా కనెక్షన్ ఉంది. ‘3’, ‘ఆడుకాలం’ ఇలా ప్రతీ సినిమా, అందులోని పాటలు నా మీద ప్రభావం చూపించాయి' అని సాయి ధరమ్ తేజ్ అన్నారు. ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’ (kara).  విఘ్నేశ్ రాజా (vignesh Raja) దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంస్థలు  ద్వారా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్  లో  ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  సాయి దుర్గ తేజ్, బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి అతిధులుగా హాజరయ్యారు. 

'విఘ్నేశ్ గారు తీసిన ‘పోరు తొళిల్ అన్నా.. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అన్నా ఎంతో  ఇష్టం. నా జీవితంలోని ప్రేమ కథలకు ధనుష్ గారి లవ్ సాంగ్స్‌కి చాలా కనెక్షన్ ఉంది. ‘3’, ‘ఆడుకాలం’ ఇలా ప్రతీ సినిమా, అందులోని పాటలు నా మీద ప్రభావం చూపించాయి. ధనుష్ గారి ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా ఉంటాయి. ‘రఘువరన్ బీటెక్’లో ఇచ్చే ఆ చిన్న స్మైల్ ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సతీష్, రాజేష్ గారికి ఈ మూవీతో లాభాలు రావాలి. ఏప్రిల్ 30న  రాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులందరూ వీక్షించి పెద్ద హిట్ చేయండి’ అని  సాయి దుర్గ తేజ్  అన్నారు.

ధనుష్ మాట్లాడుతూ  'ఓ సాధారణ యువకుడి కథ ఇది. విఘ్నేశ్ లాంటి ఓ గొప్ప వ్యక్తి నుంచి ఈ కథ వచ్చింది. విఘ్నేశ్ రాజా పేరు గుర్తు పెట్టుకోండి. ఇక ముందు మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తుంటాయి. ‘పోరు తొళిల్’ చూసిన తరువాత విఘ్నేశ్‌ ఎనర్జీ నన్ను టచ్ చేసినట్టు అనిపించింది. అందుకే ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది. మమిత అద్భుతమైన నటి. రవి కుమార్ సార్‌తో పని చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. నా ఫ్రెండ్ జీవీ ఎప్పుడూ మంచి మ్యూజిక్ ఇస్తుంటారు. ‘కుబేర’, ‘ఇడ్లీకొట్టు’ తర్వాత తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నాను. ‘కర’ ఎంతో క్వాలిటీతో రాబోతోంది' అని అన్నారు.

మమిత బైజు మాట్లాడుతూ 
‘కర’ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ మూవీ నాకెంతో నేర్పింది.. నాపై నమ్మకంతో నాకు ఈ పాత్రను ఇచ్చిన విఘ్నేశ్ గారికి థాంక్స్.    ‘తెలుగు ప్రేక్షకులు నాపై కురిపిస్తున్న ప్రేమకు రుణ పడి ఉంటా.  ఏప్రిల్ 30న మా ‘కర’ రాబోతోంది. సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

'పోరుతొళిల్’ సినిమా చూసి తెలుగు ఆడియెన్స్ నన్నెంతో ప్రశంసించారు.  అదే స్పిరిట్‌తో ఈ ‘కర’ మూవీని తీశాను. ఇది మీరు పెట్టే డబ్బు, మీ సమయం అన్నింటినీ గౌరవించేలా ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన ధనుష్ గారికి, మమితా గారికి, కేఎస్ రవి కుమార్ గారికి థాంక్స్. ఈ సినిమా ఎవర్ని  నిరాశపర్చదు’ అని దర్శకుడు విఘ్నేశ్ రాజా అన్నారు.

నిర్మాత డా. ఐషరి కె. గణేష్ మాట్లాడుతూ
‘తెలుగులో ఇదే నా మొదటి ప్రమోషనల్ ఈవెంట్.  సాయి తేజ్ గారు మా చెట్టినాడ్‌లోనే చదివారు. ఈ రోజు ఆయన మా కోసం రావడం ఆనందంగా ఉంది. విఘ్నేశ్ ఆల్రెడీ మాకు మంచి మూవీని ఇచ్చారు. ఇప్పుడు ఈ ‘కర’ కూడా మంచి విజయం సాధిస్తుంది' అని అన్నారు. 

 

Updated Date - Apr 27 , 2026 | 09:48 AM