వరుస ప్లాపులు.. 170 కోట్లు రెమ్యూనరేషన్ అడిగిన స్టార్ హీరో

ABN , Publish Date - May 06 , 2026 | 06:47 PM

ఈ మధ్యకాలంలో సినిమా బడ్జెట్ కన్నా హీరోల రెమ్యూనరేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి. వంద కోట్లు, 150 కోట్లు.. స్టార్ హీరోలు అందుకుంటున్నారు.

Star Hero

ఈ మధ్యకాలంలో సినిమా బడ్జెట్ కన్నా హీరోల రెమ్యూనరేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి. వంద కోట్లు, 150 కోట్లు.. స్టార్ హీరోలు అందుకుంటున్నారు. తాజాగా కోలీవుడ్ లో ఒక స్టార్ హీరో తన తదుపరి సినిమాకు ఏకంగా రూ. 170 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే.. గత కొన్నేళ్లుగా ఈ స్టార్ హీరోకు విజయాలు లేవు. 2025 మొదట్లో ఈ హీరో సినిమా రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్నిఅందుకుంది. దాని తరువాత ఇంకో సినిమాతో వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేదు.


ప్రస్తుతం ఆ హీరో ఎలాంటి ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. తాజాగా ఒక నిర్మాణ సంస్థ.. హీరోకి కథ చెప్పడానికి వెళ్తే.. రూ. 170 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడని టాక్. అంతకుముందు సినిమాకు రూ. 160 కోట్లు తీసుకున్నాను.. ఇప్పుడు 170 ఇవ్వమని అడిగాడట. వరుస ప్లాపులు అందుకున్నా.. తనకు ఇమేజ్ ఉండడంతో రెమ్యూనరేషన్ లో అస్సలు తగ్గదేలే లేదు అని అంటున్నాడని తమిళ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.


ఇక ఈ విషయం కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. హీరోగారి డిమాండ్ విని చాలామంది నిర్మాతలు నవ్వుకుంటున్నారట. ఆయన మార్కెట్ బయట ఎలా ఉంది అనేది తెలియదేమో పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారట. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ హీరో అజిత్ అని అంటున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ తరువాత అజిత్ నుంచి ఏ సినిమా రాలేదు. మధ్యలో రేసింగ్ అంటూ కొన్ని నెలలు కనిపించలేదు. ఆ తరువాత అధిక్ రవిచంద్రన్ తో ఒక సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ, ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఈ సినిమాకే అజిత్ అంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడని కొందరు అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - May 06 , 2026 | 07:10 PM