Deepshikha Chandran: క్వీన్ ఆఫ్ మార్క్ దీప్శిఖా చంద్రన్

ABN , Publish Date - Jan 03 , 2026 | 08:32 PM

కన్నడ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మార్క్'(Mark Movie) శాండల్ వూడ్లో అదరగొడుతోంది.  ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

కన్నడ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మార్క్'(Mark Movie) శాండల్ వుడ్ లో అదరగొడుతోంది.  ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. సుదీప్, దీప్శిఖా చంద్రన్ (Deepshikha Chandran) కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి  విజయ్ కార్తికేయన్ దర్శకుడు. ఈ సినిమాకు సుదీప్  నటన ఈ చిత్రానికి ఎంత హైలైట్గా నిలిచింది. హీరోయిన్ దీప్శిఖ చంద్రన్ నటన కూడా అంతే ప్లస్ అయిందని విమర్శకులు చెబుతున్నారు.

Deeoika.jpg

తెరపై ఆమె కనిపించిన ప్రతిసారి ఈలలు, చప్పట్లను అందుకుంటోంది. దీప్శిఖా స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులని అలరించింది. ఆమె యాక్షన్ బ్లాక్ ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులు ఆమెను 'మార్క్ క్వీన్','క్వీన్ ఆఫ్ మార్క్' అని  ప్రశంసలు కురిపిస్తున్నారు.  దీప్శిఖ చంద్రన్  కెరీర్‌లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిందని చెబుతోంది.  

Updated Date - Jan 03 , 2026 | 08:39 PM