Vikram: 60 ఏళ్ళ వయస్సులో ఆ ఫిట్ నెస్ ఏంటి సామీ..

ABN , Publish Date - Jun 12 , 2026 | 08:28 PM

సాధారణంగా ప్రతి మనిషికి వయస్సు పెరిగేకొద్ది అందం తగ్గుతోంది. కానీ, ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు మాత్రం వయస్సు పెరిగేకొద్ది అందం మరింతగా పెరుగుతుంది.

Vikram

సాధారణంగా ప్రతి మనిషికి వయస్సు పెరిగేకొద్ది అందం తగ్గుతోంది. కానీ, ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు మాత్రం వయస్సు పెరిగేకొద్ది అందం మరింతగా పెరుగుతుంది. అలాంటి హీరోల్లో చియాన్ విక్రమ్ (Vikram) ఒకరు. 60 ఏళ్ళ వయస్సులో కూడా విక్రమ్ బాడీ చూస్తే కుర్ర హీరోలు సైతం కుళ్ళుకొనేలా ఉన్నారు. ఆయన కొడుకు కూడా హీరోగా మారి సినిమాలు తీస్తున్నాడు. కానీ, విక్రమ్ లో ఇసుమంతైనా అందం తగ్గలేదు అంటే ఆశ్చర్యం లేదు. గత కొంతకాలంగా విక్రమ్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. తాజాగా చియాన్.. తన తరువాతి చిత్రాన్ని అనౌన్స్ చేశారు. టాలెంటెడ్ డైరెక్టర్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ 63 వ సినిమా పట్టాలెక్కింది.


గతంలో విక్రమ్ - ఆనంద్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఇంకొక్కడు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. మళ్లీ దాదాపు కొన్నేళ్ల తర్వాత ఈ సక్సెస్ ఫుల్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి ఆనంద్ శంకర్ చియాన్ విక్రమ్ కోసం అంతకుమించిన ఒక పవర్‌ఫుల్ యాక్షన్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. విక్రమ్ సరికొత్త మేకోవర్‌తో, మునుపెన్నడూ చూడని ఒక డిఫరెంట్ లుక్‌లో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. జూన్ 12 నుంచే ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు తెలుపుతూ ఒక ఈవెంట్ నిర్వహించారు.


ఇక ఈ ఈవెంట్ లో విక్రమ్ లుక్ అందరినీ షాక్ అయ్యేలా చేసింది. వైట్ కలర్ టీషర్ట్.. బ్లాక్ జీన్స్.. గాగుల్స్ తో విక్రమ్ పాతికేళ్ళ కుర్రాడిలా కనిపించారు. అసలు ఆయనను చూసి కుర్ర హీరో అని చెప్పినా నమ్మేస్తారు. ఆ ఫిట్ నెస్ బాడీ.. లుక్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఇక విక్రమ్ లుక్ చూసి ఈయనకు ఏజ్ రివర్స్ అవుతోంది అనుకుంటా అని కొందరు.. అసలు 60 ఏళ్ళ వయస్సులో కూడా ఆ కటౌట్ ఏంటి సామీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి విక్రమ్ ఈ సినిమాతో మరో హిట్ ని అందుకుంటారేమో చూడాలి.

Updated Date - Jun 12 , 2026 | 08:44 PM