Power House: చియాన్ విక్రమ్ మాస్ అవతారం.. పగలు క్యాటరర్.. రాత్రి అయితే..
ABN , Publish Date - Sep 15 , 2026 | 08:49 AM
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడు ఆనంద్ శంకర్‌తో కలిసి ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘పవర్‌హౌస్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ తాజాగా టైటిల్ అనౌన్స్‌మెంట్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. దీనిలో విక్రమ్ పాత్రను రెండు విభిన్న కోణాల్లో చూపించారు. పగటిపూట పెళ్లిళ్లకు క్యాటరింగ్ చేసే వ్యక్తిగా కనిపించే ఆయన.. రాత్రి మాత్రం అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్‌గా మారడం ఆసక్తి కలిగిస్తోంది. ఒకే వ్యక్తిలో ఇలాంటి రెండు భిన్నమైన షేడ్స్ ఉండటంతో ‘పవర్‌హౌస్’ కథ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. విక్రమ్ లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
‘పవర్‌హౌస్’ టైటిల్ అనౌన్స్‌మెంట్ ప్రోమోను మాస్, యాక్షన్ అంశాలతో ఆసక్తికరంగా రూపొందించారు. విక్రమ్‌ను ఇప్పటివరకు చూడని తరహా పాత్రలో చూపించేందుకు దర్శకుడు ఆనంద్ శంకర్ ప్రయత్నిస్తున్నట్లు ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. సత్య జ్యోతి ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్తాన్ని నిర్మిస్తోంది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. రియా శిబు కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027లో థియేటర్లలోకి రానుంది.