చెన్నైలో భాగ్యరాజ్ పేరిట రోడ్డు.. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూపులు

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:40 PM

దివంగత సినీ నటదర్శకుడు భాగ్యరాజ్ నివసించిన స్థానిక నుంగంబాక్కంలోని రోడ్డుకు ఆయన పేరును పెట్టనున్నారు.

Bhagyaraj

దివంగత సినీ నటదర్శకుడు భాగ్యరాజ్ (K. Bhagyaraj) నివసించిన స్థానిక నుంగంబాక్కం (Nungambakkam) లోని రోడ్డుకు ఆయన పేరును పెట్టనున్నారు. భాగ్యరాజ్ నుంగంబాక్కం లేక్ ఏరియాలోని 5వ క్రాస్ రోడ్డులో నివసించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన హఠాత్తుగా కన్నుమూయడంతో కోలీవుడ్ తో పాటు ఆయన అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

ఈ నేపథ్యంలో ఆయన నివసించిన రోడ్డుకు 'స్క్రీన్ రైటర్ కింగ్ కె.భాగ్యరాజ్ రోడ్‌గా మార్చాలని ఇటీవల చెన్నై కార్పొరేషన్ (Chennai Corporation) తీర్మానించింది. ఆ తీర్మాన ప్రతిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు శనివారం ఆ రోడ్డును, భాగ్యరాజ్ ఇల్లును పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే. ఆ రోడ్డుకు కొత్త పేరు పెట్టనున్నట్లు కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి.

Updated Date - Sep 27 , 2026 | 01:01 PM