రజనీ, ధనుష్ ఇళ్లలో.. బాంబులు పెట్టాం! త్వ‌ర‌లో.. పేలుతాయి

ABN , Publish Date - Apr 12 , 2026 | 06:16 AM

చెన్నై పోయెస్ గార్డెన్‌లోని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన అల్లుడు, నటుడు ధనుష్ నివాసాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Rajinikanth, Dhanush

చెన్నై పోయెస్ గార్డెన్‌లోని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), ఆయన అల్లుడు, నటుడు ధనుష్ (Dhanush) నివాసాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. డీజీపీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి ఈమెయిల్ ద్వారా ఓ సందేశం పంపుతూ పోయెస్ గార్డెన్ (Poes Garden) లోని వీరిద్దరి నివాసాల్లో బాంబులున్నాయని, త్వరలో అవి పేలనున్నాయని పేర్కొన్నారు.

దీంతో అప్రమత్తమైన డీజీపీ కార్యాలయ సిబ్బంది గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో కలిసి రజినీకాంత్, ధనుష్ నివాసాల్లో తనిఖీలు జరిపారు. బాంబులేవీ లేకపోవడంతో అది ఉత్తుత్తి బెదరింపని నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాంబు బెదరింపు చేసిన వ్యక్తి ఆచూకీని కనుగొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Updated Date - Apr 12 , 2026 | 06:16 AM