Kathi: డీఎంకే అయినా.. టీవీకే అయినా మార్పులేదు!
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:40 PM
ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించే పోలీసులకు వారాంతపు సెలవులు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రముఖ నటుడు కార్తి ప్రశ్నించారు.
రాష్ట్ర పోలీసులకు గత డీఎంకే ప్రభుత్వంలో లాగే ప్రస్తుత టీవీకే ప్రభుత్వం కూడా వారాంతపు సెలవు ప్రకటించలేదని ప్రముఖ నటుడు కార్తి (Karthi) పేర్కొన్నారు. కోవైలో శుక్రవారం జరిగిన మాజీ పోలీస్ అధికారుల ట్రస్ట్ 10వ వార్షికోత్సవంలో కార్తి ప్రత్యేక అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రజలకు భద్రత కల్పిస్తున్న పోలీసులకు పొరుగు రాష్ట్రాల్లో లాగే వారాంతపు సెలవు ప్రకటించకుండా గత డీఎంకే ప్రభుత్వం లాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం కూడా ఎందుకని జాప్యం చేస్తుందో అర్ధం కావడం లేదన్నారు.
అంకితభావంతో పనిచేస్తున్న పోలీసులకు మీడియా అండగా నిలిచిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పోలీసులకు వారాంతపు సెలవులను వెంటనే ప్రకటించాలని ఆయన టీవీకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.