ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’కు సీక్వెల్
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:29 PM
యంగ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్రాగన్’కు త్వరలోనే రెండో భాగం రానుంది.
యంగ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు (Ashwath Marimuthu) దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా (Pradeep Ranganathan) నటించిన ‘డ్రాగన్’కు త్వరలోనే రెండో భాగం రానుంది. ఈ విషయాన్ని దర్శక హీరోలిద్దరూ తమతమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయదు లొహర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం గత యేడాది విడుదలై రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. (Dragon 2)
ఈ నేపథ్యంలో మూవీ విడుదలై యేడాది పూర్తయిన సందర్భంగా దర్శక కథానాయకులు వేర్వేరుగా ట్వీట్ చేశారు. ‘డ్రాగన్-2’ మూవీ చిత్రం పోస్టర్‌ను షేర్ చేసి సీక్వెల్‌పై హింట్ ఇచ్చారు. అలాగే, దర్శకుడు చేసిన ట్వీట్‌లో ‘సెల్ఫ్ మేడ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది. త్వరలోనే మరోమారు ఈ కాంబో కలువనుంది’ అని పేర్కొన్నారు. దీంతో ‘డ్రాగన్’కు సీక్వెల్ ఖాయమని తెలుస్తోంది.