Con City: తెలుగులోనూ.. వస్తున్న అర్జున్ దాస్ ‘కాన్ సిటీ’
ABN , Publish Date - Jan 20 , 2026 | 10:24 PM
విలక్షణ నటుడు అర్జున్ దాస్, అన్నాబెన్ జంటగా రూపొందే చిత్రానికి ‘కాన్ సిటీ’ అనే టైటిల్ ఖరారు చేశారు.
విలక్షణ నటుడు అర్జున్‌దాస్ (Arjun Das), అన్నాబెన్ (Anna Ben) జంటగా రూపొందే చిత్రానికి ‘కాన్ సిటీ’ (Con City) అనే టైటిల్ ఖరారు చేశారు. పూర్తి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో యోగిబాబు, వడివుక్కరసి, బాల నటుడు అఖిలన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవర్ హౌస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. తమిళంతో పాటు తెలుగు భాషలోను విడుదల కానుంది.
ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే మధ్యతరగతి కుటుంబం భావోద్వేగాల నేపథ్యంలో సినిమా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఆఫీస్ బ్యాగ్ తగిలించుకుని అర్జున్ దాస్ ఉంటే ఆయన చుట్టూ హ్యాండ్ బ్యాగ్‌తో అన్నాబెన్, సూట్‌కేసుతో యోగిబాబు, ట్రోఫీతో వీల్‌చైర్‌లో అఖిలన్‌తో వడివుక్కరసి ఉండేలా ఈ లుక్‌ను డిజైన్ చేశారు. చెన్నై, మంగుళూరు, ముంబై నగరాల్లో 80 శాతం మేరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారు.
ఇదిలాఉంటే.. ఓజీ సినిమాతో అర్జున్ దాస్‌కు తెలుగు నాట అమంచి గుర్తింపు ఉండగా కల్కి సినిమాతో అన్నాబెన్ సైతం తెలుగు వారికి దగ్గరవడం విశేషం. చూడాలి మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో.