వారిని కఠినంగా.. శిక్షించాలి

ABN , Publish Date - Mar 05 , 2026 | 08:44 AM

సామాజిక మాధ్యమాల్లో హీరోయిన్ ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హీరోయిన్ అను పమ పరమేశ్వరన్ కోరారు.

Anupama Parameswaran

సామాజిక మాధ్యమాల్లో హీరోయిన్ ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హీరోయిన్ అను పమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కోరారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ, 'సామాజిక మాధ్యమాల్లో హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్, డీప్ ఫేక్ చేసి, ఫొటోలను షేర్ చేసే వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

ఇలాంటివి పునరా వృత్తం కాకూడదు. ఇలాంటి దుష్టులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి హేయమైన చర్యలను నశింపజేయాలి' అని కోరారు. కాగా, ఇటీవల తమిళంలో ధృవ్ విక్రమ్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'బైసన్' మూవీలో అనుపమ పరమేశ్వరన్ అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే.

Updated Date - Mar 05 , 2026 | 08:44 AM