అనుప‌మా.. కొత్త సైకలాజికల్ థ్రిల్లర్‌

ABN , Publish Date - Feb 18 , 2026 | 06:48 PM

వ‌రుస సినిమాల‌తో పాన్ ఇండియా వ్యాప్తంగా దూసుకుపోతోంది మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్.

anupama parameswaran

వ‌రుస సినిమాల‌తో పాన్ ఇండియా వ్యాప్తంగా దూసుకుపోతోంది మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama Parameswaran). ఇటీవ‌ల 'లాక్‌డౌన్' అనే సినిమాతో ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి మంచి మార్కులు కొట్టేసింది. ప్ర‌స్తుతం ద‌క్షిణాదిలో ప్ర‌తి భాష‌లో రెండేసి చొప్పున చిత్రాలతో బిజీగా ఉంది.

ఇదిలా ఉండానే తాజాగా ఈ అమ్మ‌డు ఎస్ కే జీ ఎంటర్టైన్మెంట్ (Ess Kay Gee Entertainment), బెంచ్‌మార్క్ స్టోరీటెల్లర్స్ (Benchmark Storytellers) సంయుక్తంగా నిర్మించ‌నున్న ఓ క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న‌ ఈ చిత్రానికి ఆర్జే షాన్ (RJ Shaan) దర్శకత్వం వహించనుండగా, శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

అయితే... గతంలో అనుపమ – షాన్ కాంబినేషన్‌లో వచ్చిన షార్ట్ ఫిల్మ్‌కు అద్భుత స్పందన రావడంతో.. ఇప్పుడు అదే కాంబనేషన్ తో కొత్త కాన్సెప్ట్‌తో మ‌రోమారు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నేడు అనుపమ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కానుండ‌గా.. టైటిల్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

Updated Date - Feb 19 , 2026 | 02:15 PM