Kattalan: ఐపిఎల్‌ దెబ్బకు మరో సినిమా అవుట్!

ABN , Publish Date - Apr 30 , 2026 | 11:18 AM

ఆంటోనీ వర్గీస్‌ హీరోగా, పాల్‌ జార్జ్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న 'కాట్టాళన్‌' మూవీ విడుదల వాయిదా పడింది. మే 14న విడుదల కావాల్సిన ఈ సినిమా మే 28న రాబోతోంది.

Kattalan Movie

మలయాళ చిత్రం 'కాట్టాళన్‌'పై ఐపీఎల్‌ దెబ్బ పడింది. మే 14న విడుదల కావాల్సిన ఈ సినిమాను 28కి వాయిదా వేశారు. మే 31తో ఐపీఎల్‌ కు ఫుల్ స్టాప్‌ పడబోతున్న నేపథ్యంతో ఈ సినిమాను రెండు వారాల పాటు వాయిదా వేశారు. 'కాట్టాళన్‌' సినిమాతో ఆంటోనీ వర్గీస్‌ హీరోగానూ, పాల్‌ జార్జ్‌ డైరెక్టర్‌గానూ పరిచయం అవుతున్నారు. దీనిని 'మార్కో' నిర్మాణ సంస్థ క్యూబ్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై షరీఫ్‌ మహమ్మద్‌ నిర్మిస్తున్నారు. ఏనుగుల వేట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్‌ పరంగా 'మార్కో'ని మించి ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలను థాయ్‌లాండ్‌లో, ఓంగ్ - బాక్ సిరీస్‌తో సహా అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రసిద్ధి చెందిన ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ, అతని బృందం ఆధ్వర్యంలో చిత్రీకరించారు. ఓంగ్-బాక్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 'పాంగ్' అనే ఏనుగు కూడా ఈ సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని 'కాంతార, మహారాజ' వంటి బ్లాక్‌బస్టర్‌లతో దక్షిణ భారతదేశం అంతటా సంచలనం సృష్టించిన బి. అజనీష్ లోక్‌నాథ్ అందించారు.


దుషారా విజయన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, కబీర్‌ దుహాన్‌ సింగ్‌, రాపర్‌ బేబీ జీన్‌, రాజ్‌ తిరందాసు, పార్థ్‌ తివారి, జగదీష్, సిద్ధిక్, వ్లాగర్ - సింగర్ హనాన్ షా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్కోరీ, స్క్రీన్‌ప్లేను జోబీ వర్గీస్, పాల్ జార్జ్, జెరో జేకబ్ సమకూర్చారు. ఈ మూవీని ప్రధాన భారతీయ భాషలలో మే 28న విడుదల చేస్తున్నారు.

Updated Date - Apr 30 , 2026 | 11:18 AM