హీరో విజయ్‌కు కుమారుడి మ‌రో షాక్!

ABN , Publish Date - Mar 12 , 2026 | 07:23 AM

త‌మిళ‌నాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రముఖ సినీ నటుడు, 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) అధినేత విజయ్‌కు (thalapathy vijay) షాకులపై మీద షాకులు తగులుతున్నాయి.

vijay

త‌మిళ‌నాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రముఖ సినీ నటుడు, 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) అధినేత విజయ్‌కు (thalapathy vijay) షాకులపై మీద షాకులు తగులుతున్నాయి. ఆయన కుమారుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) తన ఇన్షియల్‌లో 'వి'కి బదులుగా తల్లి సంగీత పేరుతో 'ఎస్' చేర్చుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ప్రచారం జరుగుతోంది. అయితే.. తమిళ సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్ హీరోల పిల్లలు తమ తండ్రి పేరులోని మొదటి అక్షరాన్ని త‌మ పేరు చివ‌ర గానీ మొద‌ట గానీ ఉపయోగించడం పరిపాటి.

ఈ నేప‌థ్యంలో 'సిగ్మా' అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండ‌స్ట్రీకి పరిచయం అవుత‌న్న‌ జాసన్.. త‌న టేకింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. త్వ‌ర‌లోనే సినిమా ప్రేక్ష‌కుల ఎదుట‌కు కూడా రానుంది. అయితే.. ఇటీవ‌ల‌ తన రెండో చిత్రం పనులను ప్రారంభించిన జాసన్ ఆ చిత్రం టైటిల్ కార్డు, సంతకంలో తన తండ్రి విజయ్ పేరుతో మొదలయ్యే 'వి' అనే ఇన్షియల్‌ను తొలగించినట్లు సమాచారం.

అదే సమయంలో తండ్రి పేరుకు బదులుగా తల్లి సంగీత (Sangeetha) పేరులోని 'ఎస్' అనే అక్షరాన్ని ఇన్షియల్‌గా మార్చుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. తాజాగా విజ‌య్ రాజ‌కీయ ప్ర‌యాణం, ఇటీవ‌లి ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ విష‌యం పెద్ద‌ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే విజ‌య్ విడాకులు అంశం ఫ్యాన్స్ జీర్జించుకోలేక పోతుండ‌గా ఇప్పుడు ఈ అంశం కూడా తోడ‌వ‌డంతో మున్ముందు ఇంకా ఎలాంటి వార్త‌లు వినాల్సి వ‌స్తుందో అని అభిమానులు నిరాశ‌లో ఉన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 11:21 AM