శ్రీలీలకు.. మరో మంచి ఛాన్స్‌

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:16 AM

వరుస ఫ్లాప్స్‌తో కెరీర్‌ పరంగా తెలుగులో డల్‌ అయిన శ్రీలీల (Sreeleela) ఇప్పుడు తమిళంలో రెండు భారీ చిత్రాల్లో నటించే ఛాన్స్‌ దక్కించుకున్నారు.

sreeleela

వరుస ఫ్లాప్స్‌తో కెరీర్‌ పరంగా తెలుగులో డల్‌ అయిన శ్రీలీల (Sreeleela) ఇప్పుడు తమిళంలో రెండు భారీ చిత్రాల్లో నటించే ఛాన్స్‌ దక్కించుకున్నారు. అజిత్‌ హీరోగా నటించే డేర్ డెవిల్ (Dare Devil) చిత్రానికి ఇటీవలే కమిటైన శ్రీలీల తాజాగా రజనీకాంత్‌ ‘ధర్మన్‌’ (Dharman) సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ రెండు చిత్రాలు ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్‌ ఇస్తాయని అందరూ భావిస్తున్నారు.

రజనీకాంత్ (Rajinikanth) టైటిల్‌ రోల్‌లో అశ్వత్‌ మారిముత్తు (Ashwath Marimuthu) తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్ (Raaj Kamal Films International) బ్యానర్‌పై కమల్‌ హాసన్ (Kamal Haasan) నిర్మిస్తున్నారు. అలాగే ఈ నెల 20న విడుదలవుతున్న తమిళ చిత్రం ‘ఓమ్‌’తో ప్రేక్షకులను శ్రీలీల పలకరించనుంది. ఇవి కాక మ‌రో రెండు హిందీ చిత్రాల‌లో న‌టిస్తుండ‌గా తెలుగులో మాత్రం ఆఫ‌ర్లు లేవు.

ఈ క్ర‌మంలో తాజాగా ఓమ్ (Om) నుంచి విడుద‌ల చేసిన పాట ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. అందులో ద‌నుష్ (Dhanush) భార్య రోజా పాత్ర‌లో శ్రీలీల లుక్‌ను చూసి అంతా తెగ ప్ర‌శంసిస్తున్నారు. తెలుగులో మంచి క్యారెక్ట‌ర్ బేస్ పాత్ర‌లు రాలేదు కానీ త‌మిళంలో మంచి ఛాన్స్ ప‌ట్టేసిందంటూ కొనియాడుతున్నారు.

Updated Date - Nov 05 , 2026 | 07:23 AM