కావ్య, అనిరుధ్ పెళ్లి.. సన్ ఉద్యోగులకు బంగారు ఉంగరాలు!

ABN , Publish Date - Nov 24 , 2026 | 07:38 AM

కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ పెళ్లి సందర్భంగా సన్ గ్రూప్ ఉద్యోగులకు బంగారు ఉంగరాలు, చాక్లెట్లతో కూడిన గిఫ్ట్ బాక్సులు ఇచ్చారు.

Kaviya Maran

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో (Sunrisers Hyderabad CEO) కావ్య మారన్ (Kaviya Maran) వివాహం ఇప్పుడు సినీ, వ్యాపార, క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రముఖ జంట పెళ్లి వేడుకలు ఎంత వైభవంగా జరిగాయో.. పెళ్లి సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన ప్రత్యేక కానుకలు కూడా అంతే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సన్ గ్రూప్ ఉద్యోగులకు బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఈ నెల 11న అనిరుధ్, కావ్య మారన్ వివాహ బంధంతో ఒక్కటైన విష‌యం తెలిసిందే. గ్రీస్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో తమిళ సంప్రదాయాల ప్రకారం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు హాజర‌య్యారు. (Anirudh Ravichander, Kaviya Maran Wedding)

చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్

గ్రీస్‌లో వివాహ వేడుక అనంతరం ఈ నెల 21న చెన్నైలో అనిరుధ్, కావ్య మారన్‌ల వివాహ రిసెప్షన్ అంగ‌రంగ వైభవంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు దేశంలోని అన్ని ఇండ‌స్ట్రీల నుంచి వివిధ భాషల అగ్రతారలతో పాటు ధోని ఇత‌ర‌ అంత‌ర్జాతీయ క్రికెట‌ర్స్ సైతం హ‌జ‌ర‌య్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి.

ఉద్యోగులకు గోల్డెన్ సర్‌ప్రైజ్!

అయితే.. తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుకను పురస్కరించుకుని కావ్య మారన్ కుటుంబం సన్ గ్రూప్ ఉద్యోగులకు (Sun Group Employees Gifts) ప్రత్యేక గిఫ్ట్ బాక్సులు ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేసింది. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా గిఫ్ట్ బాక్సులను సిద్ధం చేయించి పంపించినట్లు తెలుస్తోంది. ఈ బాక్సుల్లో వివాహ ఆహ్వాన పత్రికతో పాటు బంగారు ఉంగరం, చాక్లెట్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు భారీ స్థాయిలో ఖ‌రీదైన లంచ్ కూడా ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం. కాగా.. ఈ బహుమతులపై స‌న్ గ్రూప్‌ యాజమాన్యం ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు.

ప్రైవేట్ జెట్‌లో హనీమూన్ ట్రిప్?

ఇదిలాఉంటే.. ఇక పెళ్లి, రిసెప్షన్ సందడి ముగిసిన నేపథ్యంలో ఈ కొత్త జంట హనీమూన్ ప్రయాణం (Kaviya Anirudh Honeymoon) పై ఆసక్తికరమైన ప్రచారం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్‌కు చెందిన అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ జెట్‌లో అనిరుధ్, కావ్య మారన్ ప్రయాణిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 'VT-SRH' రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ప్రైవేట్ జెట్‌లో ఈ జంట హనీమూన్‌కు బయలుదేరినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే వీరు ఎక్కడికి వెళ్లారు? వారి హనీమూన్ డెస్టినేషన్ ఏది? అనే విషయాలపై స్పష్టత లేదు.

Updated Date - Nov 24 , 2026 | 07:41 AM