మహాబలిపురంలో అజిత్‌ పూజలు

ABN , Publish Date - Apr 01 , 2026 | 07:35 PM

గత కొన్ని నెలలుగా కార్‌ రేసింగ్‌లపై దృష్టిసారించి దుబాయ్‌లో ఉంటున్న అగ్రహీరో అజిత్‌ కుమార్‌ (Ajith Kumar) సోమవారం మహాబలిపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

గత కొన్ని నెలలుగా కార్‌ రేసింగ్‌లపై దృష్టిసారించి దుబాయ్‌లో ఉంటున్న అగ్రహీరో అజిత్‌ కుమార్‌ (Ajith Kumar) సోమవారం మహాబలిపురంలోని వెస్ట్‌ రాజా వీధిలో ప్రసిద్ధగాంచిన మల్లికేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఆలయానికి వెళ్ళిన అజిత్‌ను ఆలయ అర్చకులు సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత ప్రధాన అర్చకుడు సంతోష్‌ చేత తన కుటుంబ సభ్యుల పేర్ల మీద అర్చన, పూజలు చేయించారు. అలాగే, 11 ముఖ రుద్రాక్ష మాలను స్వామి సన్నిధిలో ఉంచి పూజ చేసిన తర్వాత దాన్ని అజిత్‌ ధరించారు.  అజిత్‌కు అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇదిలావుండగా, త్వరలో ఇటలీలో జరుగనున్న కార్‌ రేసింగ్‌ పోటీల్లో అజిత్‌ పాల్గొననున్నారు. ఈ పోటీల్లో అజిత్‌ కార్‌ రేసింగ్‌ టీమ్‌ విజయం సాధించాలని అర్చకులు ఆశీర్వదించారు.

Updated Date - Apr 01 , 2026 | 07:35 PM