ఆందోళన వద్దు.. ఇద్దరు క్షేమంగానే ఉన్నారు
ABN , Publish Date - Mar 02 , 2026 | 04:37 PM
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులు భయాందోళనలకు గురవుతున్నారు. కోలీవుడ్ స్టార్స్ అజిత్ కుమార్ (Ajith), మాధవన్ (R Madhavan) దుబాయిలోనే ఉన్నారనే వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతూ వారు సురక్షితంగా ఇండియా చేరుకోవాలని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. దీనిపై తాజాగా అజిత్ టీమ్ స్పందించింది. ఆయన క్షేమంగా ఉన్నారని మేనేజర్ తెలిపారు.
అజిత్ నిర్వహించే మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్స్ కోసం ఈ మధ్యన దుబాయ్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. అక్కడ స్పోర్ట్స్ ఈవెంట్స్ పూర్తి కావడంతో అజిత్ ఇప్పటికే చెన్నైకి తిరిగి రావాల్సి ఉంది. కానీ దుబాయ్ నుంచి విమాన రాకపోకలకు అంతరాయం కలగడంతో అక్కడే ఉండిపోయారు. అయితే అజిత్ క్షేమంగా ఉన్నారని.. ఆయన జర్నీ ప్లానింగ్ మార్చుకున్నారని మేనేజర్ వెల్లడించారు. అభిమానులు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. మరో నటుడు మాధవన్ కూడా క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం దుబాయ్‌లో లేనని, కుటుంబంతో సహా అమెరికాలో ఉన్నట్లు మీడియాకు వెల్లడించారు.
Read Also: బూటుకాలుతో తన్నులు కూడా తిన్నాను!
థమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య గట్టి పోటీ