ప్రియాంక మోహాన్.. కొత్త సినిమా

ABN , Publish Date - Sep 07 , 2026 | 09:12 AM

జై, ప్రియాంకా మోహన్ హీరోహీరోయిన్లుగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ 29వ చిత్రం ఘనంగా ప్రారంభమైంది.

Priyanka Mohan

ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించే 29వ చిత్రం పూజా కార్యక్రమం ఆదివారం నగరంలో జరిగింది. ఈ చిత్రంలో యువ హీరో జై, హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ (Priyanka Mohan) జంటగా నటిస్తున్నారు. ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు, నాజర్, రాజీవ్ మేనన్ తదితరులు నటిస్తున్నారు. విశాల్ హీరోగా వచ్చిన 'చక్ర సినిమాతో దర్శకుడిగా పరిచ యమైన ఎం.ఎస్.ఆనందన్ ఈ చిత్రానికి దర్శకుడు.

అర్జున్ అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బ్లాస్ట్' చిత్రానికి సంగీతం సమకూర్చిన రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. నిర్మాతలుగా కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్ కల్పాతి ఎస్.సు రేష్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ అర్చన కల్పాతి, అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఐశ్వర్య కల్పాతి.

Updated Date - Sep 07 , 2026 | 09:17 AM