విజయ్ ఫ్యామిలీ.. చిన్నాభిన్నం! ఒక్కొక్కరు.. ఒక్కో ప్లేస్‌లో ఆశ్రయం
ABN , Publish Date - Mar 08 , 2026 | 10:27 AM
వారం పది రోజులుగా చెన్నైలో తమిళ స్టార్ విజయ్ ఫ్యామిలీ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు హాట్ టాపిక్‌గా ఉంటూ వస్తున్నాయి.
గడిచిన వారం పది రోజులుగా చెన్నైలో తమిల స్టార్ విజయ్ ఫ్యామిలీ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు అంతకంతకు పెరుగుతునే ఉన్నాయి. భర్తతో విడాకులు కావాలంటూ ఓ మారు, ఓ నటితో ఎఫైర్ ఉందంటూ మరోసారి చెప్పిన సంగీత తాజాగా మరోసారి కోర్టును ఆశ్రయించింది.
తమ విడాకుల కేసు ముగిసే వరకు తన భర్త, సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ (thalapathy vijay) కి చెందిన నీలాంకరై నివాసంలో నివసించేందుకు అనుమతి ఇవ్వాలంటూ విజయ్ సతీమణి సంగీత (sangeetha) శనివారం చెంగల్పట్టు కోర్టులో ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.
విజయ్ నుంచి విడాకులు కోరడంతో నీలాంకరై (Neelankarai) నివాసంలో ఉండేందుకు అనుమతించడం లేదని, దీంతో తాను చెన్నైలో ఇల్లు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు. అందువల్ల విడాకుల కేసు విచారణ పూర్తయ్యేంతవరకు నీలాంకరైలో ఉన్న విజయ్ నివాసంలో ఉండేందుకు అనుమతి ఇచ్చేలా ఆదేశించాలని ఆమె కోరారు.

అలాగే, రూ.కోట్లు సంపాదిస్తున్న విజయ్.. తనకు, తన పిల్లలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను అందించాలని, నీలాంకరై నివాసంలో తనకు, విజయ్‌కు సమాన హక్కు ఉందని, దీంతో ఆ ఇంటిలో నివసించేందుకు అనుమతి కోరగా, న్యాయవాది ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా, ఇటీవల ఓ నటితో తన భర్త విజయ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని, అందువల్ల తనకు విడాకులు కావాలంటూ సంగీత చెంగల్పట్టు (Chengalpattu District Court) ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే.
అయితే.. ఈ విడాకుల అంశం తెర మీదకు వచ్చినప్పటి నుంచి వీరి ఫ్యామిలీ కాస్త చిన్నాభిన్నం అయినట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ భార్య సంగీత లండన్‌లో ఉండగా, కుమారుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) స్థానిక అశోక్ నగర్‌లో అద్దె ఫ్లాట్‌లోను, కుమార్తె దివ్య సాషా (Dhivya Sasha) పీజీ హాస్టల్‌లో ఉంటున్నారు.
ఇదిలాఉంటే.. విజయ్‌కు నీలాంకరైతో పాటు పట్టిణంపాక్కంలో విలావంతమైన గృహాలు ఉన్నాయి. ఈ విడాకులు కేసు తీర్పు వచ్చి పంపకాలు జరిగేంత వరకు ఎక్కడి వారు అక్కడే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.. ఈ విషయాలు తెలిసిన చాలా మంది.. ఎంత డబ్బు, హోదా, ఉంటే ఏం లాభం సొంత వాళ్లు ఒక్కరు కూడా పక్కన లేనప్పుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.