ఈ సినిమా చూశాక.. ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్ళు తాగరు
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:12 PM
నాలుగేండ్ల క్రితం వచ్చిన కార్తి సర్దార్ సినిమాకు సీక్వెల్‌గా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సర్దార్2 మరో వారం రోజుల్లో సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ఎదుటకు రానుంది.
నాలుగేండ్ల క్రితం వచ్చిన కార్తి (Karthi) సర్దార్ సినిమాకు సీక్వెల్‌గా పీఎస్ మిత్రన్ (P. S. Mithran) దర్శకత్వంలో రూపొందిన చిత్రం సర్దార్2 (Sardar 2) మరో వారం రోజుల్లో సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా నా అభిమానులకు సరైన సినిమా ఇవ్వలేకపోయాను.. కానీ ఈసారి సర్దార్ 2తో దిగి కొడుతున్నాం అంటూ హీరో కార్తి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. గడిచిన రెండేండ్లలో నేను చేసిన సినిమాలు అంచనాలు అందుకోలేక పోయాయి.
"రాజుమురుగన్ కాంబినేషన్‌లో ఒక మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో 'జపాన్' చేశాను. 'ఆవేశం' తరహాలో ఆ సినిమా ఉంటుందని భావించాను కానీ అనుకున్నట్లుగా రాలేదు. ఇక నా అభిమానులు చాలా మంది నన్ను పక్కా యాక్షన్ సినిమాల్లో చూడటానికి ఇష్టపడతారు. అయినప్పటికీ నేను చేసిన 'మెయ్యళగన్' (సత్యం సుందరం) చిత్రాన్ని వారు ఎంతగానో ఆదరించారు. ఇక నలన్ కుమారసామి లాంటి టాలెంటెడ్ దర్శకుడిని ప్రోత్సహించాలనే 'వా వాథియార్' చేశాను.ష కానీ ఇవేవి అనుకున్నంతగా ఫలితం తీసుకు రాలేకపోయాననే సంతృప్తి నాలో ఉంది. అయితే ఈసారి 'సర్దార్ 2' విషయంలో ఎలాంటి లోటు ఉంచలేదు.. దిగి కొడుతున్నాం అంటూ ఫ్యాన్స్‌ను ఉత్సాహ పరిచాడు.
ఇంకా ఆయన సినిమా గురించి మట్లాడుతూ.. తాను హీరోగా నటించిన 'సర్దార్-2' చిత్రంలో ప్రతి ఒక్కరూ చలించిపోయే నిజం ఉందని అన్నారు. 'తమిళ సినిమా కేవలం వినోదం కోస మే కాదు. తమిళ సిని మా రాష్ట్రానికే గర్వకారణం. నేను విదేశాల్లో చదువుకునే రోజుల్లో తెలుగు, హిందీ తదితర భాషల్లో సినిమాలు చూశాను. కానీ, ఒక తమిళ సినిమా చూసినపుడు కలిగే భావన, సంతృప్తి ప్రత్యేకం.
ప్రేక్షకులు నటన, నృత్యాన్ని చూస్తారు. ఫైట్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ వారిపైనే జోకులు వేస్తారు. ఇలా హేళన చేసేవారిని అభినందిస్తూ ఒక సినిమా తీయాలని వుంది. ఇపుడు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ బాటిళ్ళలో నీళ్ళు తాగుతున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్ళు తాగాలా వద్దా? ఈ సినిమాలో ఏం చెప్పారు? అనే విషయాలపై ఆలోచించకుండా ఉండ లేరు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కదిలించే నిజాన్ని ఈ సినిమాలో చెప్పాం. ఇదే మా సినిమాలో ప్రధానాంశం. దర్శకుడు మిత్రన్ ఈ సినిమాలో అదే చేశారు. ఈ సినిమా విడుదలయ్యాక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది' అని కార్తి వివరించారు.