Heroines: సంక్రాంతి చిత్రాలపైనే హీరోయిన్ల గురి..
ABN , Publish Date - Jan 04 , 2026 | 09:54 AM
పలువురు హీరోయిన్లు తాము నటించిన సంక్రాంతి సినిమాలపై గంపెడాశలు పెట్టుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు.
పలువురు హీరోయిన్లు తాము నటించిన సంక్రాంతి సినిమాలపై గంపెడాశలు పెట్టుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఇటు తమిళం, అటు తెలుగులో తీసిన చిత్రాలు రెండు భాషలు లేదా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి. ఈ చిత్రాలు హిట్ అయితే తమకు పాన్ ఇండియా స్థాయిలో పేరుతో పాటు క్రేజ్ పెరుగుతుందన్నది వారి ఆశ.
వారిలో పూజా హెగ్డే, నయనతార, శ్రీలీల, మమితా బైజు, మాళవికా మోహనన్ ఇలా అనేక మంది ఉన్నారు. వీరితో పాటు మరికొందరు హీరోయిన్లు నటించిన సినిమాల వివరాలను పరిశీలిస్తే, విజయ్ ‘జన నాయగన్’ మూవీలో పూజా హెగ్డే, మమితా బైజు నటించారు. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘పరాశక్తి’లో శ్రీలీల నటించారు. ఈ మూవీలు తమిళం, తెలుగు భాషల్లో విడుదలవుతున్నాయి.
దీంతో ఈ హీరోయిన్లు విజయం కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా తెలుగులో పలువురు అగ్రహీరోల చిత్రాల్లో నటించిన నయనతార, మాళవికా మోహనన్, ఆషికా రంగనాథన్, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి, సంయుక్త కూడా సంక్రాంతి సినిమాలు సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు.