Kamal Roy: న‌టి ఊర్వశి సోదరుడు.. కమల్ క‌న్నుమూత‌

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:53 AM

సీనియర్ నటి ఊర్వశి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు, ప్రముఖ తమిళ నటుడు కమల్ రాయ్ (54) బుధవారం చెన్నైలో గుండెపోటుతో మృతి చెందారు.

Kamal Roy

సీనియర్‌ నటి ఊర్వశి (Urvashi) సోదరుడు, తమిళ నటుడు కమల్‌ రాయ్‌ (54) (Kamal Roy) ఇకలేరు. బుధవారం చెన్నైలో గుండెపోటుతో మృతి చెందారు. ‘సయూజ్యం’, ‘కొలిలాక్కం’, ‘యువజనోల్సవం’, ‘మంజు’, ‘కల్యాణ సౌగంధికం, ‘వాచలం’ వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా పలు సినిమాల్లో విలన్‌గా కూడా రాణించారు.

ఆయన మృతిపట్ల కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది. ఇదిలాఉంటే.. ఊర్వ‌శి సోద‌రి క‌ల్ప‌న రంజ‌ని (Kalpana Ranjani) న‌టి కాగా నాగార్జున ఊపిరి సినిమా ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవ‌గా ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే హైద‌రాబాదులో గుండెపోటుతో మ‌ర‌ణించింది.

Updated Date - Jan 22 , 2026 | 07:32 AM