Sreeleela: ఇప్పటివరకు చేసిన సినిమాల్లో.. ‘పరాశక్తి’ ది బెస్ట్‌

ABN , Publish Date - Jan 09 , 2026 | 06:54 PM

ఇప్పటివరకు నటించిన పాత్రల కంటే ‘పరాశక్తి’ లోని పాత్ర తన కెరీర్‌లో మరపురానిద‌ని, అలాంటి పాత్ర శ్రీలీల అన్నారు.

Sreeleela

ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో పోషించిన పాత్రల కంటే ‘పరాశక్తి’ (Parasakthi) లోని పాత్ర తన కెరీర్‌లో మరపురాని పాత్ర అని, అలాంటి పాత్ర ఇచ్చినందుకు దర్శకురాలు సుధా కొంగరాకు ధన్యవాదాలని క్రేజీ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela ) అన్నారు. ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ, ‘నాకు రేసింగ్‌ అంటే అమితమైన ఇష్టం. అందుకే మలేసియాలో హీరో, రేసర్‌ అజిత్‌ కుమార్‌ను కలిశాను. ఆయనకు కూడా నేను అభిమానినే. ఆయన సింప్లిసిటీ ఎంతగానో నచ్చింది.

Sreeleela

కాగా ‘పరాశక్తి’ మూవీలో ఎంతో అర్థవంతమైన, లోతైన పాత్ర పోషించాను. ఇది మరపురాని అందమైన జ్ఞాపకాలను ఇచ్చింది. హీరో శివకార్తికేయన్‌కు సక్సెస్‌ కేవలం సినిమా వల్లే లభించలేదు. ఆయన చేసే మంచి పనులు కూడా ఆ విజయానికి కారణం. సినిమాలో నటించిన నటీనటుల మాత్రమే కాదు సెట్‌లోని ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఎంతో ప్రేమతో ఉండేవారు. ఈ గుణమే ఆయనను లక్షలాంది మందికి చేరువ చేసింది’ అని పేర్కొన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 07:18 PM