Pooja Hegde: బుట్ట‌బొమ్మ.. ఆఖరి అస్త్రం! పీక్స్‌లో.. అందాల ఆరబోత‌

ABN , Publish Date - May 10 , 2026 | 06:23 PM

ఒకప్పుడు టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్ గా వెలిగిపోయిన బుట్టబొమ్మ పూజా హెగ్డే, ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది.

Pooja Hegde

ఒకప్పుడు టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్ గా వెలిగిపోయిన బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde), ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. వరుస ప్లాపులు పలకరిస్తున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ సెగలు పుట్టిస్తూనే ఉంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్లోరల్ బికినీ టాప్, డెనిమ్ జీన్స్ ధరించి తన నడుము అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా బాలీవుడ్ చిత్రం హై జవానీ తో ఇష్క్ హోనా హై (Hai Jawani Toh Ishq Hona Hai) లో తేరా హో జాన్ (Tera Ho Jaun ) పాట‌లో చేసిన ఈ గ్లామర్ షో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Pooja Hegde

పూజా హెగ్డే కెరీర్ ఒకప్పుడు పూలబాటలా ఉండేది. కానీ, గత కొన్నేళ్లుగా పరిస్థితి తలకిందులైంది. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ .. ఇలా భాషతో సంబంధం లేకుండా చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మధ్యలో ఏడాది పాటు విరామం తీసుకున్నప్పటికీ, రీఎంట్రీలో వచ్చిన 'రెట్రో', 'దేవా' సినిమాలు కూడా ఆమెకు కలిసి రాలేదు. దీంతో కొందరు నెటిజన్లు ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు.

Pooja Hegde

అయితే, పూజా మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. ప్రస్తుతం పూజా ఆశలన్నీ బాలీవుడ్ మూవీ తేరా హో జాన్ పైనే ఉన్నాయి. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పూజాతో పాటు మరో క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తోంది. తాజాగా విడుదలైన వీడియో సాంగ్‌లో పూజా గ్లామర్ పీక్స్‌లో ఉంది. గ్లామర్‌తో పాటు నటనకు స్కోప్ ఉన్న పాత్ర అని పూజా ధీమా వ్యక్తం చేస్తోంది. హిందీ ఆడియన్స్‌ను మెప్పించి మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలని చూస్తోంది.

Pooja Hegde

తెలుగు, హిందీ మాత్రమే కాదు.. కోలీవుడ్‌లోనూ పూజా ఒక భారీ ప్రాజెక్టును లైన్‌లో పెట్టింది. దళపతి విజయ్ సరసన జన నాయగన్ సినిమాలో నటించింది. 'బీస్ట్' సినిమా ప్లాప్ అయినప్పటికీ, విజయ్ మళ్ళీ పూజకు అవకాశం ఇవ్వడం విశేషం. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ క్రేజ్ తోనైనా తన ప్లాపుల పరంపరకు ఫుల్ స్టాప్ పడుతుందని పూజా ఆశిస్తోంది. సినిమాలు హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెడితే, పూజా హెగ్డే బ్రాండ్ వాల్యూ మాత్రం తగ్గడం లేదు. ఒక హిట్ పడితే మళ్ళీ ఈ బుట్టబొమ్మ రేంజ్ ఎక్కడికో వెళ్తుందనడంలో సందేహం లేదు. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో పూజ తన అదృష్టాన్ని ఎలా మార్చుకుంటుందో వేచి చూడాలి.

Pooja Hegde

Updated Date - May 10 , 2026 | 07:06 PM