Nidhhi Agerwal: తిరుప‌తి.. అంటే చాలా ఇష్టం! నెల రోజుల్లో.. రెండు సార్లు వ‌చ్చా

ABN , Publish Date - Aug 02 , 2026 | 02:39 PM

తిరుపతి అంటే తనకు చాలా ఇష్టమని ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్ తెలిపారు.

Nidhhi Agerwal

హీరోయిన్ నిధి అగర్వాల్ ((Nidhhi Agerwal)) తిరుపతిలో సందడి చేశారు. నగరంలోని ఓ ప్రముఖ డైమండ్ స్టోర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె అభిమానుల మధ్య సందడి నెలకొల్పారు. కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పలు సినిమా పాటలకు ఉత్సాహంగా స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిధి అగర్వాల్.. తిరుపతి అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. నెల రోజుల్లోనే రెండోసారి తిరుపతికి రావడం, శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

Nidhhi Agerwal

తమిళనాడులో అభిమానులు తనకు గుడి నిర్మించడం జీవితంలో మరచిపోలేని సంఘటన అని నిధి అన్నారు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. వారి అభిమానమే తనకు పెద్ద బహుమతి అని పేర్కొన్నారు.

నిధి అగర్వాల్ వ్యాఖ్యలు అక్కడికి వచ్చిన అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆమెతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపించారు. స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా నిధి చేసిన డ్యాన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Updated Date - Aug 02 , 2026 | 02:39 PM