సైదాపేట.. ఇంటిని విక్రయించిన మీనా? నిజ‌మేనా

ABN , Publish Date - Apr 23 , 2026 | 07:28 PM

చెన్నై సైదాపేట, శ్రీరామ్ కాలనీలో ఉన్న ఇంటిని నటి మీనా విక్రయించినట్టు సోషల్ మీడియాలో విస్తృ తంగా ప్రచారం సాగుతోంది.

Meena

చెన్నై (Chennai) సైదాపేట (Saidapet) , శ్రీరామ్ కాలనీ (Sriram Colony)లో ఉన్న ఇంటిని నటి మీనా (Meena) విక్రయించినట్టు సోషల్ మీడియాలో విస్తృ తంగా ప్రచారం సాగుతోంది. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆరంభంలో ఆమె స్థానిక సాలిగ్రామంలో ఉండే వారు. ఆ తర్వాత శ్రీరామ్ కాలనీలో విశాలమైన స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు నిర్మించి తన భర్తతో కలిసి ఉండేవారు.

అయితే.. క‌రోనా స‌మ‌యంలో మీనా భ‌ర్త సాగ‌ర్ (Sagar) అనారోగ్యం కారణంగా మృతి చెందారు. అప్పటి నుంచి తన కుమార్తె నైనికా (Nainika) తో ఉంటున్న మీనా... ఇటీవల శ్రీరామ్ కాలనీలోని ఇంటిని రూ.100 కోట్లకు విక్రయించారంటూ ప్రచారం జరుగుతోంది. ఇల్లు విక్రయించి అమెరికా వెళ్ళిపోయారంటూ మరికొందరు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వార్త‌లు గ‌త వారం ప‌ది రోజులుగా సామాజిక మాద్య‌మాల్లో విప‌రీతంగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఇంటి విక్రయ ప్రచారంపై మీనా సన్నిహితులు స్పందిస్తూ, 'సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు. శ్రీరామ్ కాలనీలో ఉన్న ఇల్లు నటి మీనాకు భావోద్వేగపరంగా చాలా దగ్గరగా ఉంద‌ని, ఆమె భర్త ఈ ఇంటిలోనే తుదిశ్వాస విడిచారు. మీనా కుమార్తె ఈ ఇంటిలోనే పుట్టి పెరిగిందని తెలిపారు.

ఇలా ఆ ఇంటితో ఎంతో సెంటిమెంట్ ఉన్న ఇంటిని మీనా ఎందుకు విక్రయిస్తారు. పైగా విశాలమైన ఇంటిని రూ.100 కోట్లకు విక్రయించారంటూ సాగుతున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదు. ఇలాంటి అసత్య వార్తలను వైరల్ చేయొద్దని కోరుతున్నాం' అని మీనా సన్నిహితులు పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. మీనా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి హీరోయిన్‌గా బిజీగా ఉన్న స‌మ‌యంలో 20 ఏంబ్ల క్రితం సుమారు రూ.10 కోట్ల వ్య‌యంతో కేర‌ళ స్టైల్‌లో ప్ర‌త్యేక క‌ల‌ప‌ను ఉపయోగించి నిర్మించుకుంది. ఇప్పుడు ఈ ఇంటి విలువ ప‌దింత‌లు అవ‌డంతో సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్ర‌చారాలు అధికంగా అవుతున్నాయి అంటూ ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు.

Updated Date - Apr 23 , 2026 | 07:39 PM