ఇనియ: బరువు పెరిగితే ఆంటీ, అక్క పాత్రల్లోనే నటించాలా?
ABN , Publish Date - Feb 21 , 2026 | 11:50 AM
నటి బరువు పెరిగితే ఆంటీ, అక్క పాత్రల్లోనే నటించాలా? అని హీరోయిన్ ఇనియ ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్లు కాస్త బొద్దుగా ఉండటంలో ఎలాంటి తప్పులేదన్నారు.
నటి బరువు పెరిగితే ఆంటీ, అక్క పాత్రల్లోనే నటించాలా? అని హీరోయిన్ ఇనియ ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్లు కాస్త బొద్దుగా ఉండటంలో ఎలాంటి తప్పులేదన్నారు. చిన్నచిన్న పాత్రల్లో నటిస్తూ ఇప్పుడు హీరోయిన్ స్థాయికి ఎదిగిన ఇనియ నటించిన తాజా చిత్రం ‘స్వీటి నాటి క్రేజి’ గత వారం విడుదలైంది. ఇది అడల్ట్ కంటెంట్ మూవీ కావడంతో గ్లామర్ డోస్ ఒక్కసారిగా పెంచేశారు. పైగా ఆమె ఆంటీ పాత్రలో నటించారు. ఈ మూవీ విడుదలైన తర్వాత ఆమె పాత్రపై విమర్శలు వచ్చాయి.
వీటిపై ఇనియ స్పందిస్తూ, ‘ఆరంభం నుంచి హీరోయిన్‌గానే నటిస్తున్నాను. ఇటీవల కాలు, భుజం భాగంలో మైనర్ సర్జరీ జరిగింది. దీంతో సరైన వ్యాయామం చేయకపోవడంతో బరువు పెరిగాను. సాధారణంగా ఓ నటి బరువు పెరిగితే ఆంటీ, అక్క పాత్రలే చేయాలన్న నిబంధన లేదు. బొద్దుగా ఉండటం తప్పుకాదు. స్లిమ్‌గా ఉన్న అనేక మంది హీరోయిన్లు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. కానీ, నేను ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నాను. అయినప్పటికీ నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు’ అంటూ తన మనసులోని మాటను వెల్లడించారు.