శివకార్తికేయన్.. సరసన భాగ్యశ్రీ బోర్సే
ABN , Publish Date - Feb 16 , 2026 | 10:45 AM
వరుస విజయాలతో దూసుకెళుతున్న హీరో శివకార్తికేయన్ సరసన టాలీవుడ్ నటి భాగ్యశ్రీ బోర్సే నటించనున్నారు.
వరుస విజయాలతో దూసుకెళుతున్న హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) సరసన టాలీవుడ్ నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) నటించనున్నారు. ఇందుకోసం ఆమెతో ఎన్కి సంప్రదిస్తున్నారు. 'తాయి కిళవి' దర్శ కుడు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోషట్ను తాజాగా మదురైలో పూర్తి చేశారు. ఎస్కే హీరోగా నటిస్తూనే స్వయంగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుపై ఎస్ పుట్టిన రోజైన ఈ నెల 17న అధికారికంగా వెల్లడించనున్నారు.
ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసేందుకు సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఎస్కే సరసన నటించేందుకు సమ్మతిస్తే ఆమెకు ఇది తొలి తమిళ చిత్రం అవుతుంది. పైగా, సకాంత' చిత్రంలో తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెల్సిందే. మరోవైపు, పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందించే ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.