వైభవ్ ‘మారువేషం.. మ‌రోసారి సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌

ABN , Publish Date - Jul 19 , 2026 | 08:04 PM

నటుడు వైభవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘మారువేషం’ ఫస్ట్ లుక్ విడుదలైంది.

Maaruvesham

నటుడు వైభవ్ (Vaibhav) ప్రధాన పాత్రలో రూపొందుతున్న కొత్త‌ చిత్రానికి మారువేషం (Maaruvesham)పేరును ఖరారు చేశారు. మ‌రోమారు హీరో వైభవ్ పోలీస్ ఆఫీసరుగా నటిస్తున్న ఈ సినిమా సీట్ ఎడ్జింగ్ మర్దర్ మిస్టరీ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోంది. కాగా తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్‌ లుక్‌ రిలీజ్ చేశారు. సాధారణంగా మర్డర్ మిస్టరీ జానర్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ త‌ర‌హా చిత్రాలు ప్ర‌తి క్ష‌ణం సస్పెన్స్, ఉత్కంఠగా, నిజాలు, ఊహించని మలుపులతో ప్రేక్షకులను ఆకట్టు కునేలా ఉంటాయి. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'మారువేషం' సినిమా ఈ జాబితాలో చేరుతుంది. ఓనిరో మాన్సీ పిక్చర్స్ బ్యానరుపై మంకీ మ్యాన్ కంపెనీ సహకారంతో విజయ్ ఆనంద్, వైభవ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా శ్రీని రచన, దర్శకత్వం వ‌హిస్తున్నాడు.

Maaruvesham

ఈ సినిమా గురించి దర్శ కుడు మాట్లాడుతూ.. 'ఇది కుటుంబంతో చూడదగిన డిటెక్టివ్ థ్రిల్లర్. ఉత్కంఠభరితమైన మలుపులు, భావోద్వేగ క్షణాలు, ఉత్తేజకరమైన సన్ని వేశాలతో కేసులను పరిష్కరించడంలో అభిరుచి ఉన్న పోలీస్ అధికారి తిలక్ పాత్రలో వైభవ్ నటిస్తున్నారు. ఎవరు ఏమి దాస్తున్నారు? ఒక పాత్ర ఎందుకు మారుతుంది? అది కేవలం బ‌య‌ట‌కేనా? లేక లోతైన భావోద్వేగ ప్రయాణమా? ప్రతీకారమా?, మనుగడ పోరాటమా? ప్రేమనా? మరచిపోయిన గతం నుంచి తప్పించుకునే ప్రయత్నమా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాదానాలు ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ఒక వ్యక్తి ముఖం మారవచ్చు.. కానీ, ఆ వ్యక్తి తన గతం నుంచి తప్పించుకోగలడా? అనేదే ఈ చిత్ర కథ' అని పేర్కొన్నారు. ఇందులో వైభవ్ సరసన హీరోయిన్‌గా వియన్నా నటిస్తుండ‌గా రామ్‌కీ, మునీష్ కాంత్, వివేక్ ప్రసన్న, లివింగ్ స్టన్, జార్జ్ మరియన్, జార్జ్ విజయ్, ఇందుమతి, ఎం.రామస్వామి, సెల్, మురుగన్ ముఖ్య పాత్రలను పోషించారు.

Updated Date - Jul 19 , 2026 | 09:01 PM