అజిత్ ఫ్యాన్స్.. కొత్త‌ రాజకీయ పార్టీ! ప్రధాన కార్యదర్శిగా.. అజిత్‌

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:25 PM

కోలివుడ్ అగ్రహరో అజిత్ అభిమానులు 'తమిళగ మక్కల్ కళగం(టీఎంకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు.

Ajith

కోలివుడ్ అగ్రహరో అజిత్ (Ajith Kumar) అభిమానులు 'తమిళగ మక్కల్ కళగం(టీఎంకే) (Tamilaga Makkal Kazhagam) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. ఈ జెండా ఇంచుమించుగా అధి కార పార్టీ టీవీకే జెండాను పోలిఉంది. కాగా, అజిత్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. రాజకీయాల్లోకి రానని అజిత్ స్వయంగా వెల్లడించినా ఆయన అభిమానులు మాత్రం పదేపదే ఆయన పేరును రాజకీయంగా తెరపైకి తెస్తున్నారు.

తాజాగా కల్లకుర్చి జిల్లా ఉళుందూరుపేటలో అజిత్ అభిమాన సంఘాలన్నీ కలిసి 'తమిళగ మక్కల్ కళగం' పేరుతో కొత్త పార్టీని ప్రారంభించాయి. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాయి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆభిత్, రాష్ట్ర కార్యదర్శిగా రామ్ కుమార్, రాష్ట్ర కోశాధికారిగా మహ్మద్ షా, రాష్ట్ర ఆర్గనైజర్, ప్రచార కార్యదర్శి, కార్యవర్గ సభ్యులను కూడా నియమించారు.

 Ajith

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 'రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న అజిత్ అభిమాన సంఘాల నేతలమంతా కలిసి ఒకే తాటిపైకి వచ్చి ఈ పార్టీని ఏర్పాటు చేశాం. అజిత్ సర్ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని ఆయన కోసం ఖాళీగా ఉంచాం' అని వివరించారు.

ఇవి కూడా చదవండి:

Rashmika Mandanna: షూటింగ్‌కు వెళ్లాలంటే.. వణుకు పుట్టింది

మ‌ళ్లీ ఏమైందిరా.. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్

Husharu Pittalu: ఒరేయ్.. ఏం సినిమారా ఇది.. ఇంట్లోవాళ్లతో చూస్తే చెప్పుతో కొడతారు

Updated Date - Sep 21 , 2026 | 01:09 PM