జైలర్ 2.. యాక్షన్ సన్నివేశాలు రీ షూట్‌?

ABN , Publish Date - Mar 29 , 2026 | 04:41 PM

రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న జైలర్ 2 చిత్రం కోసం యాక్షన్ సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారు.

jailer2

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) కాంబినేషన్‌లో సన్ పిక్చర్స్ పతాకంపై భారీ వ్యయంతో రూపుదిద్దుకుంటున్న జైలర్ 2 (Jailer 2) చిత్రం కోసం యాక్షన్ సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారు.

ఈ ఫైట్ సీక్వెన్సెస్‌ను రజనీకాంత్ ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో చూడని విధంగా చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం రజనీ రిస్క్ తీసుకుని ఫైట్ సన్నివేశాల్లో నటిస్తున్నట్టు చిత్ర బృందం చెబుతోంది.

ఈ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో హీరోకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నిర్మాణ సంస్థ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఆదేవిధంగా ఈ మూవీలో రజనీకాంత్, బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ (Shah Rukh Khan) మధ్య కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాలున్నాయని, ఇవి చిత్రానికి హైలెట్గా నిలుస్తాయని చెబుతున్నారు.

కాగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం స్వరాలు సమకూర్చే ఈ చిత్రంలో ఎస్ జే సూర్య, సురాజ్ వెంజర మూడు, రమ్యకృష్ణన్, యోగిబాబు సహా పలువురు నటిస్తున్నారు. షారూక్ ఖాన్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అతిథిపాత్రల్లో కనిపించనున్నారు.

Updated Date - Mar 29 , 2026 | 04:41 PM