ఇళయరాజా.. కుటుంబం నుంచి హీరో! రంగంలోకి స్టార్‌ టెక్నికల్‌ టీమ్‌

ABN , Publish Date - Jul 07 , 2026 | 10:07 AM

ఇళయరాజా అన్న ఆర్‌.టి. భాస్కర్‌ కుమారుడు జయన్‌ హీరోగా తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు.

Ilayaraja

ఇసైజ్ఞాని ఇళయరాజా (Ilaiyaraaja) అన్న, సినీ నిర్మాత ఆర్‌.టి.భాస్కర్ (RT Bhaskar) కుమారుడు జయన్ (Jayan) తమిళ వెండితెరకు హీరోగా పరిచయమవుతున్నాడు. దీంతో ఆర్‌టీ భాస్కర్‌ కుటుంబంతో మంచి స్నేహ సంబంధాలున్న పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చి ఈ చిత్ర నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు.

ఇందులోభాగంగా, ఈ చిత్రాన్ని నిర్మాత రమణన్‌ బాలగంగాధరన్ (Ramanan Balagangadharan) నిర్మిస్తుండగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) కథ అందిచ‌గా, మ‌రో సుధా కొంగ‌ర (Sudha Kongara) క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. యువన్‌ శంకర్‌ రాజా (Yuvan Shankar Raja) సంగీతం అందించ‌నుండ‌డం విశేషం. కెమెరా సాయ్‌ మునీష్‌, ఎడిటర్‌ శ్రీ వాట్సన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ షాను మురళీధరన్‌, సుజిత్‌ ఎన్‌.సుబ్రమణియం (Sujith N Subramaniam) స్క్రీన్‌ప్లే అందిచడంతో పాటు దర్శకత్వం వ‌హించ‌నున్నారు.

ఇదిలాఉంటే.. ఈ చిత్రంలో జయన్‌ సరసన మ‌ల‌యాళ న‌టి సోనా ఒలిక్కల్ (Sona Oliackal) హీరోయిన్‌గా నటిస్తుండగా, వాగై చంద్రశేఖర్‌, గురు సోమసుందరం, బిబియన్‌, ఆర్య లక్ష్మి, ఇందుమతి, రేష్మి, రంజిత్‌ తదితరులు నటిస్తున్నారు. సంగీతం, స్నేహం, ప్రేమ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం జయన్‌ కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా, ఆయన సినీ జర్నీకి గొప్ప ఆరంభంగా ఉంటుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Updated Date - Jul 07 , 2026 | 11:16 AM