ప్ర‌భాస్‌, అల్లు అర్జున్ సినిమాల‌కు దీటుగా నివేదా థామస్ 35

ABN , Publish Date - Feb 12 , 2026 | 05:13 PM

2025 సంవ‌త్స‌రానికి గాను ప్ర‌తిష్టాత్మ‌క 70వ‌ ఫిలింఫేర్ అవార్డుల ( 70th Filmfare Awards) సంబరానికి రంగం సిద్ధ‌మైంది.

70th Filmfare Awards

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక (70th Filmfare Awards) ఈ నెల 21న కేరళలోని కొచ్చిలో జరగనుంది. కేరళ (Kerala) ప్రభుత్వం నిర్వహించనున్న ఈ వేడుకలో తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ చిత్రాలకు అవార్డులు అందజేస్తారు. 2024లో థియేట‌ర్ల‌లో రిలీజైన సినిమాల నుంచి ఈ పురస్కారాల కోసం పోటీపడుతున్న చిత్రాల జాబితా విడుదలైంది.

తెలుగు సినిమాల్లో ‘హను-మాన్‌’, ‘లక్కీ భాస్కర్‌’, ‘పుష్ప-2’ అత్యధికంగా ఏడు విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్నాయి. త‌ర్వాతి స్థానాల్లో 35 చిన్న క‌థ కాదు, క‌ల్కి ఉన్నాయి. తమిళ చిత్రాల్లో ‘అమరన్‌’ 10 నామినేషన్లు సాధించింది. మలయాళ చిత్రాల్లో ‘ఆడు జీవితమ్‌’ ఎనిమిది నామినేషన్లు దక్కించుకుంది. కన్నడ చిత్రం ‘క్రిష్ణమ్‌ ప్రణయ సఖి’ ఐదు నామినేషన్లు సంపాదించింది.

అయితే మ‌ల‌యాళం నుంచి మాత్రం ఉత్త‌మ చిత్రాల న‌డుమ‌ పోటీ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉంది. భ్ర‌మ‌యుగం, ఆడు జీవితం, కిష్కిందకాండం, ప్రేమ‌లు, ఆవేశం, ఆటం, మంజుమ్మ‌ల్ బాయ్స్‌, ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్‌, ఉల్లోజుక్కు వంటి తొమ్మిది పేరు పొందిన, ఇప్ప‌టికే జాతీయ, అంత‌ర్జాతీయ అవార్డులు, రివార్డులు ద‌క్కించుకున్న‌ సినిమాలు నామినేష‌న్లు సాధించిన వాటిలో ఉన్నాయి. కాగా తెలుగులాగే వీటిలో ఒక్క చిత్రాన్ని మాత్ర‌మే అవార్డుకు సెల‌క్ట్ చేయ‌డం నిర్వాహ‌కుల‌కు పెద్ద టాస్క్‌ అన‌డంలో అతిశ‌యోక్తి లేదు.

ఇక త‌మిళంలో అమ‌ర‌న్‌, మ‌హ‌రాజా, ల‌బ్బ‌ర్ పందు, వాజై, కొట్టుకాళి, ‘మెయ్యళగన్‌’ (స‌త్యం సుంద‌రం) వంటి సినిమాలు నామినేట్ అయ్యాయి. చివ‌ర‌గా క‌న్న‌డ నుంచి బ్లింక్‌, భ‌గీర‌, కృష్ణ ప్ర‌ణ‌య‌స‌ఖి, శాఖ‌హారి, భీమ‌, హడినెలెంటు సినిమాలు నామినేష‌న్లు ద‌క్కించుకున్నాయి. ఈ అవార్డుల నామినేష‌న్లు ద‌క్కించుకున్న చిత్రాలు, న‌టులు, ద‌ర్శ‌కుల వివ‌రాల కోసం ఈ క్రింద చూడండి.

ఉత్తమ చిత్రం..

హనుమాన్‌

కమిటీ కుర్రోళ్లు

కల్కి 2898 ఏడీ

లక్కీ భాస్కర్‌

35 చిన్న క‌థ కాదు

పుష్ప: ది రూల్‌

ఉత్తమ దర్శకుడు..

ప్రశాంత్‌ వర్మ (హనుమాన్‌)

సుకుమార్ (పుష్ప 2)

నాగ్‌ అశ్విన్‌ (కల్కి 2898 ఏడీ)

వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)

నంద కిశోర్‌ (35 చిన్న క‌థ కాదు)

యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ నటుడు..

తేజ సజ్జ (హనుమాన్‌)

ఎన్టీఆర్‌ (దేవర)

అల్లు అర్జున్‌ (పుష్ప 2)

నాని (సరిపోదా శనివారం)

దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్‌)

సిద్ధూ జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్‌)

ఉత్తమ నటి..

నివేదా థామస్‌ (35 చిన్న క‌థ కాదు)

ఆషికా రంగనాథ్‌ (నా సామిరంగ)

రష్మిక మంద‌న్న‌ (పుష్ప 2)

మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్‌)

ప్రియాంక మోహన్‌ (సరిపోదా శనివారం)

అనుపమ పరమేశ్వరన్‌ (టిల్లు స్క్వేర్‌)

ఉత్తమ సహాయ నటుడు..

డాలీ ధనంజయ్‌ (జీబ్రా)

వినయ్‌ రాయ్‌ (హనుమాన్‌)

అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898 ఏడీ)

సత్య (మత్తు వదలరా 2)

ఫహద్‌ ఫాజిల్‌ (పుష్ప : ది రూల్‌)

ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)

ఉత్తమ సహాయ నటి..

వరలక్ష్మి శరత్‌కుమార్‌ (హనుమాన్‌)

అంజలి (గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి)

రాశి సింగ్‌ (ప్రసన్నవదనం)

శ్రద్ధా శ్రీనాథ్‌ (మెకానిక్‌ రాకీ)

ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)

శరణ్య ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజీ బ్యాండు)

Updated Date - Feb 13 , 2026 | 07:19 AM