ఫోటోగ్రాఫర్లపై నటి కృతి సనన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరి నూపుర్ సనన్ వివాహం ముగించుకుని ఉదయపూర్ నుండి తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో తన ప్రియుడు కబీర్ బహియాతో కలిసి ఉన్నప్పుడు వారిని పదేపదే ఫోటోలు, వీడియోలు తీశారు. దీంతో వీడియో రికార్డ్ చేయవద్దని వారిని గట్టిగా కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.