దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేయసి రియా చక్రవర్తి తిరిగి యాక్టింగ్ మొదలుపెట్టారు. 7 ఏళ్ల తర్వాత సెట్‌కు వెళ్లిన విషయాన్ని తెలియజేస్తూ ఆమె పోస్ట్ చేశారు. నటి అవ్వాలనే కోరికతో 17 ఏళ్ల వయసులో ముంబైలో అడుగుపెట్టినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నట్లు తెలిపారు. ఫ్యామిలీ బిజినెస్ అనే వెబ్ సిరీస్‌లో ఈ బ్యూటీ నటిస్తున్నారు. సుశాంత్ మృతి కేసులో రియా జైలుకు వెళ్లి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.