‘రామాయణ’పై మండోదరి మనసులోని మాటలివే..

ABN, Publish Date - Nov 08 , 2026 | 03:28 PM

‘రామాయణ’పై మండోదరి మనసులోని మాటలివే.. 1/13

భారీ అంచనాల మధ్య ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోన్న విషయం తెలిసిందే.

‘రామాయణ’పై మండోదరి మనసులోని మాటలివే.. 2/13

ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ విజువల్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్‌లు, అత్యున్నత సాంకేతిక విలువలపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ సినిమా ఎలా ఉందో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

‘రామాయణ’పై మండోదరి మనసులోని మాటలివే.. 3/13

తాజాగా ఈ చిత్రంలో మండోదరిగా నటించిన చందమామ కాజల్ అగర్వాల్.. తన పాత్ర గురించి, ఈ సినిమా అనుభవాల గురించి ఓ సుధీర్ఘమైన పోస్ట్ చేశారు.

‘రామాయణ’పై మండోదరి మనసులోని మాటలివే.. 4/13

పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ లాంటి భారీ ప్రాజెక్ట్‌లో ఏ రూపంలో భాగమైనా అది తనకు దక్కిన గొప్ప గౌరవమని నటి కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు.

‘రామాయణ’పై మండోదరి మనసులోని మాటలివే.. 5/13

సినిమాలో తన పాత్ర నిడివి చిన్నదే అయినప్పటికీ.. తరతరాలుగా మన సంస్కృతి, చరిత్ర, మన అస్తిత్వంతో ముడిపడి ఉన్న ఇలాంటి మహోన్నత కథలో భాగస్వామ్యం కావడం మనసును ఎంతో తృప్తితో నింపిందని తెలిపారు.

‘రామాయణ’పై మండోదరి మనసులోని మాటలివే.. 6/13

భారతీయ సినిమా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే, గ్లోబల్ సినిమా దిశగా అడుగులు వేస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో తనకు అవకాశం కల్పించినందుకు నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీష్ తివారిలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

‘రామాయణ’పై మండోదరి మనసులోని మాటలివే.. 7/13

నటనలో నిరంతరం కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి, రవి దూబే, సన్నీ డియోల్, లారా దత్తాల అంకితభావం ఎంతో స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు.

‘రామాయణ’పై మండోదరి మనసులోని మాటలివే.. 8/13

తన ఆత్మీయ మిత్రులైన రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, ఆదినాథ్ కొఠారేలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం, సరదా సంభాషణలు, నవ్వులతో షూటింగ్ సమయం ఎంతో ఆహ్లాదకరంగా గడిచిందని గుర్తు చేసుకున్నారు.

‘రామాయణ’పై మండోదరి మనసులోని మాటలివే.. 9/13

కొన్ని సినిమాలను తెరపై కనిపించే టైమ్ లేదా పాత్ర నిడివితో లెక్కించలేమని.. కథలోని దైవత్వం, నిర్మాణంలో చూపిన ప్యాషన్, మనందరి సమిష్టి విశ్వాసంతోనే వాటి గొప్పతనం కొలవబడుతుందని స్పష్టం చేశారు.

‘రామాయణ’పై మండోదరి మనసులోని మాటలివే.. 10/13

మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ చిత్రానికి ఎంతో ప్రేమను అందిస్తూ, తనది చిన్న పాత్రే అయినా.. దానిని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

‘రామాయణ’పై మండోదరి మనసులోని మాటలివే.. 11/13

కొన్ని చిత్రాలు, వాటితో ఏర్పడే అనుబంధాలు కేవలం మనం పోషించిన పాత్రల కంటే ఎంతో పెద్దవని.. తన కెరీర్‌లో ‘రామాయణ’ ఎప్పటికీ అలాంటి ప్రత్యేకమైన స్థానంలోనే నిలుస్తుందని వెల్లడించారు.

‘రామాయణ’పై మండోదరి మనసులోని మాటలివే.. 12/13

తన రూపాన్ని తీర్చిదిద్దిన హెయిర్ అండ్ మేకప్ బృందం (వర్దన్ నాయక్, స్వప్నిల్, దీప), కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్, డైరెక్షన్ టీమ్‌లోని అసిస్టెంట్ డైరెక్టర్ల అంకితభావాన్ని ప్రత్యేకంగా కొనియాడుతూ ఈ విజయం మీదేనని ప్రశంసించారు.

‘రామాయణ’పై మండోదరి మనసులోని మాటలివే.. 13/13

‘రామాయణ’ అనుభవాలను పంచుకుంటూ అందులో మండోదరిగా చేసిన కాజల్ అగర్వాల్ చేసిన ఈ భావోద్వేగపూరితమైన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది.

Updated at - Nov 08 , 2026 | 03:28 PM